మంచిదారిలో నడిచే ప్రతి ఒక్కరూ వాల్మీకులే

ABN , First Publish Date - 2021-10-21T04:23:42+05:30 IST

రామాయణంలోని 20 వేల శ్లోకాలలో ధర్మం గురించి వాల్మీకి వివరించారని, చెడు ఆలోచనలు వదిలి మంచిదారిలో నడిచే ప్రతి ఒక్కరూ వాల్మీకులేనని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ సూచించారు.

మంచిదారిలో నడిచే ప్రతి ఒక్కరూ వాల్మీకులే
మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

సిద్దిపేట అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 20 : రామాయణంలోని 20 వేల శ్లోకాలలో ధర్మం గురించి వాల్మీకి వివరించారని, చెడు ఆలోచనలు వదిలి మంచిదారిలో నడిచే ప్రతి ఒక్కరూ వాల్మీకులేనని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన మహర్షి వాల్మీకి జయంతికి ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఏదైనా తప్పు చేస్తే గ్రహించి, దాని ద్వారా నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు తెలియజేయాలని యువతకు సూచించారు. వాల్మీకి మహర్షి మాదిరిగా మీరు కూడా ధ్యానం చేయాలన్నారు. అంతకు ముందు వివిధ కులసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వాల్మీకి, బోయలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు, అలాగే వాల్మీకి ఫెడరేషన్‌ ద్వారా రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీ సరోజ, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి డి.లత, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, బీసీ స్టడీ సర్కిల్‌ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T04:23:42+05:30 IST