Abn logo
Sep 19 2021 @ 01:23AM

గణేష్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం

భువనగిరి పెద్దచెరువు వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

నేడు గంగమ్మ ఒడికి గణనాథుడు 

శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు,  

నేటి ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు మద్యం అమ్మకాల బంద్‌ 

బాణసంచా, డీజే నిషేధం : కమిషనర్‌ మహేష్‌ భగవత్‌


విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్రకు జిల్లా యంత్రాంగం సర్వంసిద్ధం చేసింది.  అన్ని శాఖల సమన్వయంతో పోలీస్‌శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. ముందు జాగ్రత్త చర్య గా ఎంపిక చేసిన చెరువుల వద్ద గజ ఈతగాళ్లను, చిన్నపాటి పడవలను అందుబాటులో ఉంచారు. శోభాయాత్ర ఊరేగింపులో డీజే, బాణాసంచా నిషేధించినట్లు పోలీసులు ప్రకటించారు. ఉదయమే శోభాయాత్ర ప్రారంభించి చీకటిపడేలోపు నిమజ్జనం పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తులు మద్యం తాగకూడదని, నిబంధనలు ఉల్లంఘించే వారిని వీడియో తీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 


భువనగిరిటౌన్‌, సెప్టెంబరు 18: నవరాత్రులపాటు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నేడు తల్లి గంగమ్మఒడికి చేరనున్నాడు. ఆదివారం జిల్లా అంతట గణేష్‌ నిమజ్జన వేడుకలు జరగనున్నాయి. గణేష్‌ శోభాయాత్రకోసం జిల్లాకేంద్రం భువనగిరితోపాటు అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లుచేశారు. జిల్లాలో సుమారు 3,600 గణేష్‌ విగ్రహాలు ప్రతిష్ఠించగా నేడు ఒక్కరోజే సుమారు 2000కు పైగా విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు. సుమారు 500 విగ్రహాలను ఈపాటికే నిమజ్జనం చేయగా, మిగిలిన విగ్రహాలను సోమవారం నిమజ్జనం చేస్తారు. నిమజ్జనంకోసం జిల్లాలో పోలీసులు 395 చెరువులను అనువైనవిగా గుర్తించగా, భారీ విగ్రహాల నిమజ్జనం కోసం తొమ్మిది చెరువుల వద్ద క్రేన్లు, భారీకేడింగ్‌, లైటింగ్‌, పర్యవేక్షణకు సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలలో నీటిమట్టం పెరగడంతో పిల్లలను వెంట తీసుకురావద్దని, ఈత వచ్చిన పెద్దలు మాత్రమే చెరువులలోకి దిగి నిమజ్జనం చేయాల ని అఽధికారులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఎంపిక చేసిన చెరువుల వద్ద గజ ఈతగాళ్లను, చిన్నపాటి పడవలను అందుబాటులో ఉంచారు. శోభాయాత్ర ఊరేగింపులో డీజే, బాణాసంచా నిషేధించినట్లు రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ప్రకటించారు. ఉదయమే శోభాయాత్ర ప్రారంభించి చీకటిపడేలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తులు మద్యం సేవించరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారిని వీడియో తీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి, యాదగిరిగుట్ట, ట్రాఫిక్‌ ఏసీపీల పర్యవేక్షణలో 1000 మంది సిబ్బంది తో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 


జిల్లా కేంద్రంలో పూర్తయిన ఏర్పాట్లు 

జిల్లా కేంద్రం భువనగిరిలో గణేష్‌ శోభాయాత్రకోసం ఏర్పాట్లు పూర్తయ్యా యి. భువనగిరి గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర జరగనుంది. నిమజ్జనంకోసం పెద్దచెరువులో మునిసిపాలిటీ, పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌ బీ, ఇరిగేషన్‌, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. శోభాయాత్ర కొనసాగే రహదారులపై ఉన్న గుంతలను పూడ్చి ఇతర మతాల ప్రార్థనా మందిరాల వద్ద బారీకేడింగ్‌ ఏర్పాటు చేశారు. గణేష్‌ ఉత్సవ సమి తి ఆధ్వర్యంలో స్థానిక జగ్జీవన్‌రామ్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన  భారీవేది క నుంచి శోభాయాత్రకు స్వాగతం పలకనున్నారు. సాంస్కృతిక కార్యక్రమా లు ప్రదర్శించనున్నారు. శాంతియుతంగా, భక్తిభావంతో శోభాయాత్రను నిర్వహించాలని మునిసిపల్‌ చెర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సుధాకర్‌, గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు దేవరకొండ నర్సింహచారి, భక్తులను కోరారు.


జిల్లాలో పోలీ్‌సశాఖ గుర్తించిన చెరువులు

జిల్లాలో భారీ విగ్రహాల నిమజ్జనానికి అనువైన తొమ్మిది చెరువులను పోలీ్‌సశాఖ గుర్తించింది. గుర్తించిన భువనగిరి పెద్దచెరువు, బీబీనగర్‌, రాఘవపురం, రాయగిరి, మోత్కూరు, సాయిగూడెం, తుమ్మలగూడెం, గోధుమకుంట, వలిగొండ  చెరువుల వద్ద పోలీ్‌సశాఖ బారీకేడింగ్‌, క్రేన్లు, లైటింగ్‌, సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు చేసింది. 


మద్యం దుకాణాలు బంద్‌ 

గణేష్‌ నిమజ్జన వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో ఆదివారం ఉద యం నుంచి సోమవారం సాయంత్రం వరకు వైన్స్‌, బార్‌లను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. దీంతో జిల్లాలోని 74 వైన్స్‌, 8 బార్లు 36 గంటల పాటు మూతపడనున్నాయి. అయితే యజమానులు ముందుగానే మద్యాన్ని బెల్ట్‌ షాపులు, ప్రైవేటు విక్రయాలకు తరలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 


శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించాలి :  కె.నారాయణరెడ్డి, డీసీపీ

గణేష్‌ నిమజ్జన శోభయాత్రను జిల్లాలో ప్రశాంతం గా జరుపుకోవాలి. ప్రమాదాలు, శాంతిభద్రతలకు ఆస్కారం ఇవ్వకుండా ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవాలి. నిమజ్జన  ఊరేగింపు ప్రారంభమయినప్పటి నుంచి భక్తులు తిరిగి ఇంటికి వెళ్లేవరకు పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రశాంతంగా శోభాయాత్రలు కొనసాగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి.