శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-04-10T05:29:00+05:30 IST

శ్రీరామనవమి పర్వదినాన్ని ఆదివారం నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపు కోనున్నారు.

శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం
శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబౌతున్న మూల హనుమాన్‌ ఆలయం


నారాయణపేట, ఏప్రిల్‌ 9: శ్రీరామనవమి పర్వదినాన్ని ఆదివారం నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపు కోనున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రముఖ దేవాలయాలు ఉత్సవ వేడుకల కోసం సర్వం సిద్ధమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మూల హానుమాన్‌ దేవాల యం వద్ద ఆదివారం మధ్యాహ్నం అభిజిత్‌ ము హూర్తంలో సీతారాముల కల్యాణ వేడుకలను జోషి రఘుప్రేమచారి ఆధ్వర్యంలో నిర్వహించను న్నారు. అనంతరం సీతారాముల పట్టాభిషేకం, వి గ్రహ ఆవిష్కరణ పూజా కార్యక్రమాలను నిర్వ హించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్య లో పాల్గొనాలని మూలహనుమాన్‌ భక్త బృందం సభ్యులు, ఆలయ అర్చకుడు శ్రీపతి కోరారు. అలాగే సురభి గోశాల, సంత్‌మఠ్‌ రామాలయం, పెద్ద రామాలయం, పళ్ల అనంతసేన స్వామి ఆల యాల్లో శ్రీరామనవమి వేడుకలను నిర్వహించేం దుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 

 మూల హనుమాన్‌ దేవాలయంలో...

జిల్లా కేంద్రంలోని మూల హనుమాన్‌ దేవాలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు హనుమాన్‌ భక్త బృందం శనివారం తెలిపింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు కల్యాణం కర పత్రాలను ఆవిష్కరించారు. శ్రీరామ పట్టాభిషేకం, విగ్రహాల ఆవిష్కరణ, ప్రత్యేక పూజలు అనంత రం అన్నదానం, సాయంత్రం 7గంటలకు చిన్నా రులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయ న్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆల య అర్చకులు శ్రీపతి, ఆలయ కమిటీ సభ్యులు నాగేందర్‌, రాజు, బుగ్గప్ప, శంకర్‌, వెంకటేష్‌, గోవింద్‌రెడ్డి, అంజి, లక్ష్మన్‌ తదితరులున్నారు.

నారాయణపేట టౌన్‌ : నారాయణపేట పట్టణం పళ్లలోని శ్రీలక్ష్మీ అనంత శయనస్వామి ఆలయంలో ఆదివారం రఘుప్రేమ్‌ జోషి ఆధ్వ ర్యంలో సాయంత్రం 6గంటలకు సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు శ్రీపాద కులకర్ణి శనివారం ఓ ప్రక టనలో తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడు కల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

ధన్వాడ : ధన్వాడ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో ఆదివారం ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త సుంకు నర్సిములు తెలిపారు. 

 మాగనూరు : మండల కేంద్రంతో పాటు, పరిధిలోని కొత్తపల్లి, కొత్తఉజ్జల్లి గ్రామాల్లో ఆదివా రం సీతారామ కల్యాణం నిర్వహించనున్నట్లు ఆ యా గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు, పురోహి తులు తెలిపారు. కొత్తఉజ్జల్లి గ్రామంలో దక్షిణా మూర్తి ఆంజనేయస్వామి జాతర సందర్భంగా సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నట్లు గ్రామస్థులు మధుసూదన్‌రెడ్డి, కనకరాజు, మాజీ సర్పంచ్‌ వాకిటి రాజు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కల్యాణోత్సవానికి, రథోత్సవానికి భక్తు లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

 బైక్‌ ర్యాలీని విజయవంతం చేయండి

నారాయణపేట క్రైం : శ్రీరామనవమి పర్వ దినం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని పల్లా హనుమాన్‌ మందిరం నుంచి భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహిం చనున్న బైక్‌ ర్యాలీని విజయవంతం చేయాలని భజరంగ్‌దళ్‌ జిల్లా నాయకులు రవికుమార్‌గౌడ్‌, వెంకటేష్‌గౌడ్‌లు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. పార్టీలకతీతంగా బైక్‌ ర్యాలీకి తరలి రావా లని, పల్లా హనుమాన్‌ మందిరం వద్ద ర్యాలీ ప్రారంభమై బ్రాహ్మన్‌వాడీ రాంమందిర్‌ వద్ద ర్యా లీ ముగుస్తుందని పేర్కొన్నారు. భజరంగ్‌దళ్‌, ఏబీవీపీ, హిందువాహినీ కార్యకర్తలు, ఆయా ప్రా ర్థనా మందిరాల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. 

Updated Date - 2022-04-10T05:29:00+05:30 IST