Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో అంతా రివర్సే

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 30 : వైసీపీ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లల్లో అంతా రివర్స్‌ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాత్మకమైన అభివృద్ధి చేయలేదన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలను దూరం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా 12లక్షల రేషన్‌కార్డులను సాకులతో తొలగించారన్నారు. అంతేగాకుండా ప్రజలపై భారం పడేలా ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు పెంచారని, అంతటితో ఊరుకోకుండా వ్యవసాయ భూములకు విద్యుత్తు మీట ర్లు ఏర్పాట చేసి, రైతుల జీవితాలను నాశనం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎ్‌సను రద్దు చేస్తామని ఉద్యోగులకు హమీ ఇచ్చి, తుంగలో తొక్కారన్నారు. సీఎం జగన్‌ కక్షసాధింపుతోనే ఇంతవరకు పాలన చేశారన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న టీడీపీ నేతలపై  తప్పుడు కేసులు పెట్టడం వైసీపీ వారికి పరిపాటిగా మారిందన్నారు. వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ, సొంత చెల్లెలికి న్యాయం చేయక,  అనుమానితులను తప్పించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.  సమావేశంలో టీడీపీ నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, సీతారామిరెడ్డి, సుబ్బరాజుపాల్గొన్నారు. 

Advertisement
Advertisement