కష్టపడి కూడబెట్టిన డబ్బుతో నాలుగంతస్తుల ఇంటిని కట్టారు.. అంగరంగ వైభవంగా గృహప్రవేశం.. మర్నాడే ఆ ఇంట్లో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2021-11-18T23:13:25+05:30 IST

లక్నోలో అన్నదమ్ములంతా వెళ్లిళ్లు అయినా కలిసిమెలసి ఉంటున్నారు. కష్టపడి కూడబెట్టిన డబ్బులతో నాలుగంతస్తుల ఇంటిని కట్టుకున్నారు. అంగరంగ వైభవంగా గృహప్రవేశం చేశారు. బంధువులు, మిత్రులతో ఇల్లంతా కళకళలాడుతోంది. అయితే..

కష్టపడి కూడబెట్టిన డబ్బుతో నాలుగంతస్తుల ఇంటిని కట్టారు.. అంగరంగ వైభవంగా గృహప్రవేశం.. మర్నాడే ఆ ఇంట్లో షాకింగ్ సీన్..!

కుటుంబంలో భార్యాభర్తల మధ్య తలెత్తే సమస్యలు ఒక్కోసారి.. చాలా దూరం వెళ్తుంటాయి. సాఫీగా సాగిపోతున్న సంసారాల్లో ఒక్కసారిగా ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. లక్నోలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అన్నదమ్ములంతా వెళ్లిళ్లు అయినా కలిసిమెలసి ఉంటున్నారు. కష్టపడి కూడబెట్టిన డబ్బులతో నాలుగంతస్తుల ఇంటిని కట్టుకున్నారు. అంగరంగ వైభవంగా గృహప్రవేశం చేశారు. బంధువులు, మిత్రులతో ఇల్లంతా కళకళలాడుతోంది. అయితే ఆ మర్నాడే వారి ఇంట్లో షాకింగ్ సీన్ జరిగింది. వివరాల్లోకి వెళితే..


లక్నో గోండాలోని శివశంకర్ పూర్వా ప్రాంతానికి చెందిన రంగనాథ్ మిశ్రాకు రామ్ కిషోర్, శ్యామ్ కిషోర్, బ్రిజ్ కిషోర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు అయినా ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. బిల్డింగ్ మెటీరియల్ పంపిణీ చేసే వ్యాపారం చేస్తున్న వీరు బాగా సంపాదించారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో గోమతి నగర్‌లోని గంగోత్రి విహార్‌లో నాలుగంతస్తుల ఇంటిని కట్టుకున్నారు. అదే ఇంట్లో అంతా కలిసి ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బంధువులందరితో ఇల్లంతా కళకళలాడుతోంది. అంతా సరదాగా సరదాగా గడిపారు. అనంతరం ఎవరి గదుల్లో వారు నిద్రపోయారు.


అయితే బుధవారం ఉదయం శ్యామ్ కిషోర్ కుటుంబం మాత్రం ఎంతసేపటికీ బయటకు రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. ఎంత పిలిచినా పలకలేదు. చివరకు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. శ్యామ్ కిషోర్(38) ఉరికి వేలాడుతూ కనిపించగా.. అతడి భార్య సద్నా(36) కూడా మంచంపై విగతజీవిగా పడి ఉంది. పోలీసులకు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగా కట్టుకున్న ఇంట్లో మొదటి రోజే భార్యభర్తలు చనిపోవడం వారి కుటుంబంలో తీవ్ర విషాధాన్ని నింపింది. 

Updated Date - 2021-11-18T23:13:25+05:30 IST