Advertisement
Advertisement
Abn logo
Advertisement

Viral video: తీరా తాళి కట్టే సమయంలో పెళ్లి కొడుక్కు షాకిచ్చిన పెళ్లికూతురు.. సినిమాను తలదన్నే సీన్.. వైరల్ అవుతోన్న వీడియో..

వివాహం అంటే ఇద్దరు మనుషులను, మనసులను కలిపే అరుదైన ఘట్టం. అప్పటి వరకూ ఎవరో తెలీని వారు.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యే రోజు. జీవితంలో ఎన్ని శుభకార్యాలు జరిగినా.. పెళ్లి రోజు మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకునే తీపి జ్ఞాపకం. కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వధువు మెడలో.. వరుడు తాళి కట్టే సందర్భం కోసం అంతా ఎదురుచూస్తుంటారు. మరోవైపు పురోహితుడి వేద మంత్రాలు, బ్యాండు వాయిద్యాలు.. ఇంకో వైపు తలంబ్రాలు చల్లేందుకు అక్షింతలు చేతిలో పెట్టుకుని సిద్ధంగా జనం.. ఆ సందర్భం కనులవిందుగా ఉంటుంది కదా. అలాంటిది, తీరా తాళి కట్టే సమయంలో వధువు రివర్స్ అయితే.. ఊహించరాని ఈ ఘటన నిజంగానే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 


బంధువులు, అతిథులతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. తలంబ్రాలు చల్లి వధూవరూలను ఆశీర్వదించి వెళ్దామని అంతా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ.. తాళి కట్టు నాయనా అన్నారు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న వరుడు.. లేచి తాళిని అందరికీ చూపించాడు. అనంతరం వధువు మెడలో కట్టబోతుండగా... ఒక్క సారిగా వరుడితో పాటూ అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. అప్పటి వరకు సందడి చేసిన మంగళవాయిద్యాలు సడన్‌గా మూగబోయాయి. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. 


 వరుడు చేతిలోని తాళిని లాక్కున్న వధువు.. దాన్ని కింద పడేసింది. బహుశా పెళ్లి ఇష్టం లేక ఇలా చేస్తుందా అని అంతా అనుకున్నారు. ఇంత వరకు వచ్చి ఇప్పుడిలా చేస్తుందేంటి అని ఇంకొందరు తిట్టుకున్నారు. ఇలా అంతా షాక్‌లో ఉండగానే పెళ్లికుమార్తె.. స్టేజి దిగి వెళ్లిపోయింది. అక్కడున్న వారంతా ఏ చేస్తుందబ్బా.. అని నిస్సహాయులై చూస్తున్నారు. 


కొంచెం దూరం వెళ్లిన వధువు.. సడెన్‌గా ఆగింది. ఒక్కసారిగా వెనక్కు తిరిగి అందరినీ చూస్తూ.. హే.... ఇది ఫ్రాంక్.. అంటూ నవ్వింది. మళ్లీ స్టేజి దగ్గరుకు వస్తున్న ఆమెను చూసి.. పెళ్లి కొడుకుతో పాటూ బంధువులందరికీ కోపం నశాలానికి అంటింది. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఈ ఫ్రాంక్‌లు ఏంట్రా బాబూ అంటూ కొందరు తిట్టుకున్నారు. ఈ కాలం ఆడపిల్లలు.. ఇలా తయారయ్యారంటూ పెద్దలు పెదవి విరిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందించారు. పెళ్లిలో ఇలాంటివి చేయకూడదంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement