Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 07:36AM

Chhattisgarh:మాజీ మంత్రి,బీజేపీ నేత ఆత్మహత్య

రాజ్‌నంద్‌గావ్: ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రాజిందర్ పాల్ సింగ్ భాటియా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని తన నివాసంలో రాజిందర్ పాల్ సింగ్ భాటియా ఉరి వేసుకుని చనిపోయారు. పోలీసులు వచ్చి భాటియా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ లభించిందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. భాటియాకు ఈ ఏడాది మార్చిలో కొవిడ్ సోకింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత భాటియా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఖుజ్జి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అయిన భాటియా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నేతృత్వంలోని మొదటి బీజేపీ ప్రభుత్వంలో వాణిజ్య,పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement