కిరణ్‌ మోరెకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-07T09:46:29+05:30 IST

భారత మాజీ ఆటగాడు, ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కీపింగ్‌ సలహాదారు కిరణ్‌ మోరె కరోనా పాజిటివ్‌గా తేలాడు. మోరెకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు...

కిరణ్‌ మోరెకు పాజిటివ్‌

ముంబై: భారత మాజీ ఆటగాడు, ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కీపింగ్‌ సలహాదారు కిరణ్‌ మోరె కరోనా పాజిటివ్‌గా తేలాడు. మోరెకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు తరలించినట్టు ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తెలిపింది. కాగా మోరె గత నెల మొదటివారంలో వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. ఇప్పటికే అక్షర్‌ పటేల్‌, దేవ్‌దత్‌ పడిక్కళ్‌ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

వాంఖడేలో మరో ముగ్గురికి..: వాంఖడే మైదానం సిబ్బందిపై కూడా కరోనా ప్రభావం చూపుతూనే ఉంది. ఇప్పటికే పది మంది పాజిటివ్‌గా తేలగా.. తాజాగా ఈ జాబితాలో మరో ముగ్గురు చేరారు. వీరిలో ఇద్దరు గ్రౌండ్‌ స్టాఫ్‌ కాగా ఓ ప్లంబర్‌ కూడా ఉన్నట్టు ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) పేర్కొంది. ఈనెల 10న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది. మహారాష్ట్రలో రోజుకు వేలాది కేసులు వెలుగుచూస్తున్నా.. ముంబైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే స్టార్‌స్పోర్ట్స్‌కు చెందిన 14 మంది సిబ్బంది కూడా పాజిటివ్‌గా తేలడం వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. వీరంతా కూడా బయో బబుల్‌లో ఉన్నవారే కావడం గమనార్హం.




Updated Date - 2021-04-07T09:46:29+05:30 IST