Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 26 2021 @ 20:55PM

టీఆర్ఎస్‌లోకి పెద్దిరెడ్డి.. 30న చేరిక

కరీంనగర్: మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 30న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరతానని ఆయన స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించటమే లక్ష్యమని చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీచేయమని కేసీఆర్ ఆదేశిస్తే పోటీచేస్తానన్నారు. టీఆర్ఎస్‌లోకి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని చెప్పారు. 30వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరతానని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.


ఏ పదవి ఆశించి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరటంలేదన్నారు. కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు పేదలకు అందించటానికి వారిధిలా ఉంటాననన్నారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీపై కేసీఆర్ నిర్ణయాలకు ప్రజలే ఆమోదం తెలుపుతున్నారని తెలిపారు. దళితబంధు పథకం హుజూరాబాద్ నుంచి ప్రారంభించటం సంతోషం కలిగించిందని వ్యాఖ్యానించారు. వెళ్ళిపోతూ బీజేపీని విమర్శించాలనుకోవటం లేదని చెప్పారు. బీజేపీలో ఉన్న వ్యవస్థ తనకు నచ్చలేదని, అందుకే బయటకు వచ్చేశానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 


Advertisement
Advertisement