Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ హయాంలోనే రజకుల సంక్షేమం

 మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా

అజిత్‌సింగ్‌నగర్‌, డిసెంబరు 5: రజకులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సంక్షేమ ఫలాలను గత టీడీపీ ప్రభుత్వం అందించిందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. రజక అభ్యుదయ సంఘం, టైలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల ఆధ్వర్యాన అజిత్‌సింగ్‌నగర్‌లోని టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం పేదలకు ఉచితంగా బొండా ఉమా చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమని ఉమా అభినందించారు. టీడీపీ పాలనలో రజకులకు ఉచితంగా ఇస్త్రీ పెట్టెలను ఇచ్చామన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా రజకుల కోసం సెంట్రల్‌ నియోజకవర్గంలో కల్యాణ మండపం నిర్మాణం చేపట్టామని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భవనాన్ని సచివాలయంగా మార్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే రజక కల్యాణ మండపాన్ని వినియోగంలోకి తెస్తామని, ప్రజలందరు చంద్రన్న నాయకత్వాన్ని బలపరచాలని ఉమా కోరారు. మధుసూదనరావు, నవనీతం సాంబశివరావు, రాజేంద్రప్రసాద్‌, సింహాచలం పాల్గొన్నారు.Advertisement
Advertisement