జనాగ్రహ దీక్షలకు స్పందన కరవు

ABN , First Publish Date - 2021-10-24T04:47:09+05:30 IST

జనాగ్రహ దీక్షలకు జనం నుంచి స్పందన కరువైందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు.

జనాగ్రహ దీక్షలకు స్పందన కరవు
తెనాలి శ్రావణ్‌కుమార్‌

తెనాలి శ్రావణ్‌ కుమార్‌

గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జనాగ్రహ దీక్షలకు జనం నుంచి స్పందన కరువైందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధను కప్పిపుచ్చుకోవడానికే సీఎం జగన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీపీలు వైసీపీవారికి, సీఎంకే మాత్రమే వస్తాయా..? మాకు రావా అంటూ ప్రశ్నించారు. గతంలో ఇదే వ్యక్తి చంద్రబాబుని ఉద్ధేశించి అభ్యంతరకర భాష వాడినప్పుడు నాడు టీడీపీ వారికి బీపీ వచ్చి వైసీపీ కార్యాలయంపై దాడులు చేశారా అని నిలదీశారు. ఫ్యాక్షన మనస్తత్వం గల వ్యక్తి అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని... కానీ ఎన్టీఆర్‌, చంద్రబాబులు నేర్పిన సంస్కారం, సంయమనం తమకు అడ్డుపడుతుందని తెలిపారు. ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని స్థితిని కప్పి పుచ్చుకోవటానికే ఇదంతా చేస్తున్నారని శ్రావణ్‌ కుమార్‌ వివరించారు. 

 

Updated Date - 2021-10-24T04:47:09+05:30 IST