టీడీపీ కార్యకర్తల జోలికొస్తే సహించం

ABN , First Publish Date - 2021-10-24T04:48:26+05:30 IST

టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించబోమని, తప్పుడు కేసుల బనాయించి ఇబ్బందిపెట్టాలని చూసినా భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

టీడీపీ కార్యకర్తల జోలికొస్తే సహించం
నారాయణపురంలో మాట్లాడుతున్న యరపతినేని శ్రీనివాసరావు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని

దాచేపల్లి, అక్టోబరు23: టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించబోమని, తప్పుడు కేసుల బనాయించి ఇబ్బందిపెట్టాలని చూసినా భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మండల పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ మునిగిపోయే పడవలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకొని పనిచేయవద్దని అధికారులకు హితవు పలికారు. వైసీపీ అక్రమాలకు, గురజాల నియోజకవర్గంలో ఏడుగురు చనిపోగా అక్రమ మైనింగ్‌కు మరో ఏడుగురు చిన్నారులు అసువులు బాశారని తెలిపారు. వైసీపీ నాయకులు, రక్తపు కూడును తింటున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో మద్యం, ఇసుక, మైనింగ్‌, మట్టి, గంజాయి వంటి అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అదోగతిపాలు చేశారని తెలిపారు. వైసీపీ మంత్రులకు, టీడీపీ రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం గాలికి వదిలేశారని, సీఎం నుంచి కిందస్థాయి కార్యకర్తల వరకు అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. త్వరలో జరగనున్న దాచేపల్లి, గురజాల నగరపంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో గుంటుపల్లి నాగేశ్వరరావు, తంగెళ్ల శ్రీనివాసరావు, వేముల తిరుమలకుమార్‌, బెల్లంకొండ బద్రి, బుర్రి కొండలు, అహ్మద, ముశ్యం శ్రీనివాసరావు, రుద్రాల అచ్చారావు, కోరె రామారావు, బత్తుల నాగేశ్వరరావు, నెల్లూరి రామకోటయ్య, సొసైటీ నారాయణ, బుల్లబ్బాయి, భాస్కరరావు, వేముల వినోద్‌రెడ్డి, మామిడి చంద్రం తదితరులున్నారు. 

 

Updated Date - 2021-10-24T04:48:26+05:30 IST