రేపు ఫోరెన్సిక్‌ లేబోరేటరీల్లో పోస్టులకు రాత పరీక్ష

ABN , First Publish Date - 2020-12-05T05:09:01+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహిస్తున్న ఫోరెన్సిక్‌ లేబోరేటరీల్లో మొత్తం 58 పోస్టులకు ఆదివారం రాత పరీక్ష నిర్వహిస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు తెలిపారు.

రేపు ఫోరెన్సిక్‌ లేబోరేటరీల్లో పోస్టులకు రాత పరీక్ష

ఏలూరు క్రైం, డిసెంబరు 4 :ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహిస్తున్న ఫోరెన్సిక్‌ లేబోరేటరీల్లో మొత్తం 58 పోస్టులకు ఆదివారం రాత పరీక్ష నిర్వహిస్తామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు తెలిపారు. కాకినాడ జేఎన్‌టీయూ కాలేజీలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ రాత పరీక్ష ఉంటుందన్నారు. జేఎన్‌టీయూ సెంటర్‌లో 1,083 విద్యార్థులు హాజరవుతున్నారని, అభ్యర్థులు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ పరీక్షకు 177 మంది, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ కెమికల్‌ పోస్టుకు 494 మంది, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బయోలజీ, సీరాలజీ  పోస్టులకు 412 మంది పరీక్షకు హాజరు కానున్నారన్నారు. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.బాలకృష్ణ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరి స్తారన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షలకు మాస్క్‌ ధరించి రావాలన్నారు. 

Updated Date - 2020-12-05T05:09:01+05:30 IST