24న సహాయ ఇంజినీర్‌ ఉద్యోగాలకు పరీక్ష

ABN , First Publish Date - 2021-01-17T04:48:51+05:30 IST

తమ సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న సహాయ, సబ్‌ ఇంజినీర్ల ఖాళీల భర్తీకి ఈ నెల 24న పరీక్ష నిర్వహించనున్నట్టు ఆర్‌సీఏఎస్‌ ఎండీ పిల్లి రమేష్‌ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు.

24న సహాయ ఇంజినీర్‌ ఉద్యోగాలకు పరీక్ష

చీపురుపల్లి: తమ సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న సహాయ, సబ్‌ ఇంజినీర్ల ఖాళీల భర్తీకి ఈ నెల 24న పరీక్ష నిర్వహించనున్నట్టు ఆర్‌సీఏఎస్‌ ఎండీ పిల్లి రమేష్‌ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికె ట్లు ఇప్పటికే పరిశీలించామని, హాల్‌ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పెట్టామని పేర్కొన్నారు. వీరికి ఈ నెల 24న గరివిడిలోని ఎస్‌డీఎస్‌ కళాశాలలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం 10 నుంచి సహాయ ఇంజినీర్లు, మధ్యా హ్నం 2 నుంచి 4 వరకూ సబ్‌ ఇంజినీర్లకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి హాజరు కావా లని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఇప్పటి వరకూ హాజ రు కాలేని వారు ఈ నెల 18లోగా తమ ధ్రువ పత్రాలను చూపించొచ్చని చెప్పారు. సర్టిఫికేట్ల పరిశీ లన పూర్తయినప్పటికీ హాల్‌ టిక్కెట్లు అందని వారు 8688400510, 86884 00572 నంబర్లను ఈ నెల 20లోగా సంప్రదించాలని ఎండీ సూచించారు.

 

Updated Date - 2021-01-17T04:48:51+05:30 IST