అమర ఆస్పత్రిలో ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-03-03T06:37:13+05:30 IST

రేణిగుంట సమీపంలోని అమర ఆస్పత్రిని కలెక్టర్‌ హరినారాయణన్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మంగళవారం పరిశీలించారు.

అమర ఆస్పత్రిలో ఏర్పాట్ల పరిశీలన
అమర ఆస్పత్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌, అర్బన్‌ ఎస్పీ తదితరులు

రేణిగుంట, మార్చి 2: రేణిగుంట సమీపంలోని అమర ఆస్పత్రిని కలెక్టర్‌ హరినారాయణన్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మంగళవారం పరిశీలించారు. గురు, శుక్రవారాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జిల్లా పర్యటన దృష్ట్యా ఉన్నతాధికారుల బృందం విమానాశ్రయం, ఏర్పేడు ఐఐటీ, అమర ఆస్పత్రి, తిరుమల ప్రాంతాలను పరిశీలించింది. ఇందులో భాగంగా తిరుపతి విమానాశ్రయ టర్మినల్‌ భవనంలో అడ్వాన్సుడ్‌ సెక్యూరిటీ లైజింగ్‌ ఉన్నతాధికారులతోనూ కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘గురువారం ఉపరాష్ట్రపతి చెన్నై నుంచి ఉదయం 9.55గంటలకు విమానాశ్రయం చేరుకుని 10.15గంటలకు ఏర్పేడు ఐఐటీని సందర్శిస్తారు. 11.20గంటలకు అమర ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయల్దేరి తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని 9.20గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని సూరత్‌కు తిరుగుప్రయాణం అవుతారు’ అని కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కనకనరసారెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్‌ సురేష్‌, సీఐఎస్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండర్‌ శుక్లా, సీఎస్‌వో రాజశేఖర్‌రెడ్డి, డీఎస్పీ రామచంద్ర, తహసీల్దార్‌ శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T06:37:13+05:30 IST