ఇంటర్‌ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు కళాశాలల పరిశీలన

ABN , First Publish Date - 2021-02-24T04:58:58+05:30 IST

మే 1 నుంచి జరిగే ఇంటర్‌ పరీక్ష కేంద్రాల ఏర్పా టుకు కళాశాలలను పరిశీలిస్తున్నట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి శేఖ్‌ సలాం తెలిపారు.

ఇంటర్‌ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు కళాశాలల పరిశీలన
లింగంపేటలో విద్యార్థులతో మాట్లాడుతున్న దృశ్యం

నూతన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
జిల్లా ఇంటర్‌ విద్యాధికారి శేఖ్‌సలాం

లింగంపేట, ఫిబ్రవరి 23: మే 1 నుంచి జరిగే ఇంటర్‌ పరీక్ష కేంద్రాల ఏర్పా టుకు కళాశాలలను పరిశీలిస్తున్నట్లు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి శేఖ్‌ సలాం తెలిపారు. కళాశాలల్లో ఎన్ని గదులు ఉన్నాయి. ఎంత ఫర్నిచర్‌ ఉంది ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఆ కేంద్రంలో వసతులు ఉన్నాయి అనే అంశాలను సేకరించి ఇంటర్‌ బోర్డుకు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రంలో వసతులు ఉన్నాయా లేదా అనే అంశాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. తరగతులను కొవిడ్‌ నిబంధ నల ప్రకారం నిర్వహించాలని ప్రిన్సిపాళ్లకు సూచించినట్లు ఆయన తెలియజే శారు. జిల్లాలో మొత్తం 16 ప్రభుత్వ కళాశాలలు, 22 ప్రైవేటు కళాశాలలు, 32 కస్తూర్బా, గురుకుల, ఆదర్ష కళాశాలలతో పాటు ఒక ఎయిడెడ్‌ కళాశాల ఉందని మొత్తం మొదటి సంవత్సరంలో 10,411 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 9,216 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఇప్పటికే 97 శాతం మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారని ఆయన తెలియజేశారు. కళాశాలలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన్‌రెడ్డి, సదాశివనగర్‌ ప్రిన్సిపాల్‌ అజ్మల్‌ఖాన్‌, లెక్చ రర్లు శివ, దుర్గయ్య, దర్‌సింగ్‌, రాజయ్య, గంగాధర్‌, బాలమల్లు, రజాక్‌లతో పాటు సిబ్బంది ఉన్నారు.

విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దు

నాగిరెడ్డిపేట: పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికావొ ద్దని, కష్టపడి చదివితే విద్యార్థులు చదువుల్లో రాణిస్తారని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి షేక్‌సలాం అన్నారు. ఆయన మంగళవారం మండల కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలన్నారు. విద్యార్థు లకు సమయం చాలా విలువైందని, విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాలు ఇది వరకు 30 ఉండేవని, కొవిడ్‌ వల్ల జిల్లాలో ప్రస్తుత సంవత్సరం మరిన్ని పరీక్షా కేంద్రాలను పెంచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి, కళాశాల ప్రిన్సిపాల్‌ మనోహ్మన్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ పరుశురాం, అధ్యాపకులు సయందర్‌రెడ్డి, ఉదయ్‌, సుధాకర్‌, శ్యామల, స్వప్న, విద్యార్థులు తదితరులున్నారు.

Updated Date - 2021-02-24T04:58:58+05:30 IST