Abn logo
Feb 24 2021 @ 00:12AM

మునిసిపల్‌ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

పార్వతీపురం, ఫిబ్రవరి 23: మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాఽథ్‌ తెలిపారు. మంగళవారం పార్వతీపురం మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి మార్చి 10న ఎన్నికలు, 14న కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. ఫలితాలు త్వరగా వెలువడేలా సిబ్బందిని, టేబుళ్లను, డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రంలో నాలుగు వైపులా సీసీ కెమెరాలను, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టంను, తాగునీటి ఏర్పాట్లు చేయాలని కమిషనర్‌ కనకమహాలక్ష్మికి సూచించారు. బ్యాలెట్‌ బాక్సులను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి విధులు సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ పరిశీలనలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.కనకమహాలక్ష్మి, ఎస్‌ఐ కళాధర్‌, మున్సిపల్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement