Abn logo
Sep 26 2021 @ 23:30PM

ప్రశాంతంగా పశుసంవర్ధక సహాయకుల డిపార్ట్‌మెంట్‌ పరీక్ష

ప్రశ్నాపత్రాలను ఓపెన్‌ చేస్తున్న శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాయలం అసోసియేట్‌ ప్రొఫెసర్‌

కడప రూరల్‌, సెప్టెంబర్‌ 26 : కడప నగరం గాంధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో ఆదివారం పశుసంవర్ధక సహాయకుల డిపార్ట్‌మెంట్‌ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించినట్లు పశుసంవర్ధకశాఖ జిల్లా సం యు క్త సంచాలకులు డాక్టర్‌ వీఎల్‌ సత్యప్రకాష్‌ తెలిపారు. పరీక్షకు 134 మంది పశుసంవర్థక సహాయకులు హాజరయ్యారన్నారు. అభ్యర్థులకు కొవిడ్‌ టెస్టును నిర్వహించిన తరువాత మాస్క్‌లతో పరీక్షకు అనుమతించామన్నారు. శ్రీవెంకటేశ్వర వశువైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వరప్రసాద్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు అబ్జర్వర్ల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగాయన్నారు.