Abn logo
Sep 27 2021 @ 23:39PM

నేటి నుంచి సచివాలయ కార్యదర్శులకు పరీక్షలు

మాట్లాడుతున్న డీఆర్వో మలోల

కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 27: గ్రామ, వార్డు సచివాయాల కార్యదర్శులందరికీ మంగళవారం నుంచి డిపార్ట్‌ మెంటల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మలోల తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న డిపార్ట్‌ మెంటల్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్‌లోని స్పందన హాలులో డీఆర్వో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా పరీక్షలు జరిగేలా సంబంధిత అధికారులు చర ్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షలు జరిగే సీకే దిన్నె, చాపాడు, ప్రొద్దుటూరులోని కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సులను నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షలు ఆన్‌లైన్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో కరెంట్‌ సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖాధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రానికి  గంట ముందే కార్యదర్శులుహాజరు కావాలని డీఆర్వో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో గంగయ్య, ఏపీపీఎస్సీ సెక్షన్‌ అధికారులు పాల్గొన్నారు.