Abn logo
Apr 8 2020 @ 05:30AM

యథేచ్ఛగా తెల్లరాయి తవ్వకాలు

ప్రభుత్వ ఆదాయానికి గండి

లాక్‌డౌన్‌ అదునుగా తరలింపు


ఉదయగిరి రూరల్‌, ఏప్రిల్‌ 7: దుత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామ ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తెల్లరాయి తవ్వకాలు చేపడుతున్నారు. ఎక్స్‌కవేటర్‌తో తెల్లరాయిని వెలికి తీసి తరలిస్తున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడం, అధికారులంతా కరోనా నియంత్రణ చర్యల్లో ఉండడంతో అక్రమార్కులు ఇదే అదునుగా తెల్లరాయి తవ్వకాలు చేపడు తున్నారు. పగలంతా అటవీ ప్రాంతంలో ఎక్స్‌కవేటర్‌తో తెల్లరాయిని వెలికి తీసి రాత్రి సమ యాల్లో వాహనాల ద్వారా తెల్లరాయిని తరలిస్తున్నారు. విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండ డంతో దాడులు జరిగినా అక్రమార్కులు భయపడడం లేదు. గతంలో కూడా ఈ గ్రామంలో తెల్లరాయి తవ్వకాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.


ఎలాంటి పన్నులు చెల్లించకుండా తెల్లరాయిని తరలిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మంగళవారం గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో వారు తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ విషయమై దుత్తలూరు తహసీల్దారు నాగరాజును వివరణ కోరగా గ్రామం లో తెల్లరాయి తవ్వకాల విషయం తమ దృష్టికి రావడంతో పరిశీలించినట్లు చెప్పారు. విచారిం చి అక్రమార్కులపై చర్యలు చేపడతామని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement