పప్పుశెట్టిపాలెం రంగురాళ్ల క్వారీలో మళ్లీ తవ్వకాలు!

ABN , First Publish Date - 2022-01-18T05:56:43+05:30 IST

మండలంలోని పప్పుశెట్టిపాలెం రెవెన్యూ పరిధిలో గల లీజు క్వారీకి కి.మీ. దూరంలో ఇటీవల బయటపడిన రంగురాళ్ల క్వారీలో ఆదివారం రాత్రి మళ్లీ తవ్వకాలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.

పప్పుశెట్టిపాలెం రంగురాళ్ల క్వారీలో మళ్లీ తవ్వకాలు!
తవ్వకాలు జరిగిన ప్రదేశంలో కాపలాగా ఉన్న సచివాలయ పోలీసు సిబ్బంది

 గొలుగొండ, జనవరి 17 : మండలంలోని పప్పుశెట్టిపాలెం రెవెన్యూ పరిధిలో గల లీజు క్వారీకి కి.మీ. దూరంలో ఇటీవల బయటపడిన రంగురాళ్ల క్వారీలో ఆదివారం రాత్రి మళ్లీ తవ్వకాలు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల ఒకటో తేదీన ఈ రంగురాళ్ల క్వారీని గుర్తించి పలువురు తవ్వకాలు జరపగా, పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంతో పాటు, క్వారీ వద్ద 144వ సెక్షన్‌ను విధించారు. అయినప్పటికీ క్వారీలో ఆదివారం రాత్రి  పలువురు త్వకాలు జరపడం విశేషం. దీనిపై సమాచారం తెలుకున్న గొలుగొండ పోలీసులు క్వారీ వద్దకు చేరుకున్నారు. అప్పటికే తవ్వకందారులు పరారయ్యారు. ఎస్‌ఐ ధనుంజయనాయుడు సూచన మేరకు సోమవారం గ్రామ సచివాలయ పోలీసులను కాపలాగా ఉంచారు. తవ్వకందారులను గుర్తించేందుకు విచారణ జరుపు తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-18T05:56:43+05:30 IST