ఉత్సాహంగా జానపద నృత్య పోటీలు

ABN , First Publish Date - 2021-10-27T05:20:37+05:30 IST

వమరవిల్లి డైట్‌లో మంగళవారం జిల్లాస్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు నిర్వహించారు.

ఉత్సాహంగా జానపద నృత్య పోటీలు
గార: థింసా నృత్యం చేస్తున్న సీతంపేట పాఠశాల విద్యార్థినులు




వమరవిల్లి (గార): వమరవిల్లి డైట్‌లో మంగళవారం జిల్లాస్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఫ రోల్‌ప్లే పోటీల్లో సత్యవరం జడ్పీ హైస్కూల్‌ ప్రథమ,  శ్రీకాకుళం ప్రభుత్వ హైస్కూల్‌  ద్వితీయ, గార జడ్పీ హైస్కూల్‌ తృతీయబహుమతి సాధించారు. ఫ ఫోక్‌డ్యాన్స్‌ పోటీల్లో కేజీబీవీ పొన్నాడ ప్రథమ,  సీతంపేట ఉన్నత పాఠశాల ద్వితీయ, కవిటి ప్రభుత్వ హైస్కూల్‌ తృతీయ బహుమతి గెలుపొందారు. డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.తిరుమలచైతన్య, అధ్యాపకులు, చాత్రోపాధ్యాయులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల:  ఫోక్‌డ్యాన్స్‌ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన పొన్నాడ కేజీబీవీ విద్యార్థినులను డీఈవో పగడాలమ్మ, ఏపీసీ ఆర్‌.జయప్రకాష్‌, జీసీడీవో శారద, పాఠశాల ప్రిన్సిపాల్‌ పి.శిరీష అభినందించారు.



 



Updated Date - 2021-10-27T05:20:37+05:30 IST