ఉత్కంఠ భరితంగా ఫుట్‌బాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-03-12T05:47:47+05:30 IST

కరీంనగర్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.

ఉత్కంఠ భరితంగా ఫుట్‌బాల్‌ పోటీలు

 - క్రీడాకారులను పరిచయం చేసుకున్న సీఐ విజ్ఞాన్‌రావు

- నల్గొండపై గెలిచిన కరీంనగర్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, మార్చి 11: కరీంనగర్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో శుక్రవారం మ్యాచ్‌లను కరీంనగర్‌ రూరల్‌ సీఐ విజ్ఞాన్‌రావు, టౌన్‌ ఏసీపీ తుల శ్రీనివాస్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ విజ్ఞాన్‌రావు మాట్లాడుతూ క్రీడలతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో, యువత ముం దుండాలన్నారు. రెండవరోజు 4 మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ మ్యాచ్‌లలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లుగా నిలిచిన క్రీడా కారులకు జిల్లా ఒలంపిక్‌ సంఘం అధ్యక్షులు నందెల్లి మహిపాల్‌, కరీంనగర్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్‌, సీఐ నటేశ్‌లు ట్రోఫీలను అందించారు. ఈ పోటీల నిర్వహణలో జిల్లా పోలీసుశాఖ, జిల్లా ఫుట్‌బాల్‌సంఘ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. 

- మ్యాచ్‌ల ఫలితాలు

మొదటి మ్యాచ్‌లో కరీంనగర్‌ జట్టు 3-0 గోల్స్‌తో నల్గొండపై విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో రంగారెడ్డి, వనపర్తి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 1-1 గోల్స్‌తో టై అయింది. మూడవ మ్యాచ్‌లో మెదక్‌జట్టు 3-1 గోల్స్‌తో ఖమ్మంపై, నాల్గొవ మ్యాచ్‌లో గద్వాల 2-0 గోల్స్‌ తేడాతో నిజామాబాద్‌ జట్టుపై గెలుపొందాయి.

 ఉత్సాహంగా క్యాంప్‌ ఫైర్‌

- ఆడిపాడిన క్రీడాకారులు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, మార్చి 11: తెలంగాణ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడాకారుల క్యాంప్‌ ఫైర్‌ ఉత్సాహంగా సాగింది. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఈ క్యాంప్‌ ఫైర్‌లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరైన ఫుట్‌బాల్‌ జట్ల క్రీడాకారులు ఆడిపాడారు. కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ తుల శ్రీనివాసరావు ఈ క్యాంప్‌ ఫైర్‌ను ప్రారంభించి క్రీడాకారులతో పాటు స్టెప్పులేశారు. గత రెండు రోజులుగా ఫుట్‌బాల్‌ ఆటతో అలసిపోయిన క్రీడాకారులు ఈ క్యాంప్‌ ఫైర్‌తో సేదతీరారు. తిరిగి శని, ఆదివారాల్లో నిర్వహించనున్న పోటీలకు సిద్ధమ య్యారు. ఈ కార్యక్రమంలో సీఐలు నటేశ్‌, విజ్ఞాన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-12T05:47:47+05:30 IST