భువనగిరి ఖిల్లాపై ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌

ABN , First Publish Date - 2021-10-18T06:14:37+05:30 IST

భువనగిరి ఖిల్లాను ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో 300, 600 ఫీట్ల ఎత్తు నుంచి రాక్‌ క్లైంబింగ్‌, రాప్లింగ్‌ శిక్షణ కొనసాగింది.

భువనగిరి ఖిల్లాపై ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌

భువనగిరి టౌన్‌, అక్టోబరు 17: భువనగిరి ఖిల్లాను ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో 300, 600 ఫీట్ల ఎత్తు నుంచి రాక్‌ క్లైంబింగ్‌, రాప్లింగ్‌ శిక్షణ కొనసాగింది. పలువురు ఔత్సాహికులు సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే జిప్‌లైన్‌ క్రీడ పర్యాటకులను అలరించింది. పర్యాటకుల వాహనాల తాకిడితో ఖిల్లా పరిసరాలు కిక్కిరిసాయి. ఖిల్లాపై కనీస వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-18T06:14:37+05:30 IST