గాజువాకలో పక్కాగా కర్ష్యూ అమలు

ABN , First Publish Date - 2021-05-08T05:00:15+05:30 IST

కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ మూడో రోజు శుక్రవారం గాజువాకలో పక్కాగా అమలు జరిగింది. మధ్యాహ్నం 12 గంటల తరువాత దుకాణాలు మూసివేశారు.

గాజువాకలో పక్కాగా కర్ష్యూ అమలు
ఖాళీగా ఉన్న గాజువాక-కణితి రోడ్డు

గాజువాక, మే 7: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ మూడో రోజు శుక్రవారం గాజువాకలో  పక్కాగా అమలు జరిగింది. మధ్యాహ్నం 12 గంటల తరువాత దుకాణాలు మూసివేశారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, ఉదయం గాజువాక మహిళా రైతు బజార్‌కు రైతులు అంతగా రాకపోవడంతో స్టాల్స్‌ ఖాళీగా కనిపించాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమోటాలు, కొన్ని కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో సదూర గ్రామాల నుంచి రైతులు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. రైతు బజార్‌కు రైతులు రాకపోవడంతో గాజువాక ప్రధాన మార్కెట్‌లో కూరగాయల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. కొందరు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. 


Updated Date - 2021-05-08T05:00:15+05:30 IST