Abn logo
Sep 22 2021 @ 23:22PM

మెనూ పక్కాగా అమలు చేయండి

విద్యార్థులతో మాట్లాడుతన్న జేసీ శ్రీరాములునాయుడు

రాజాం : వసతి గృహాల్లో మెనూ పక్కాగా అమలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీరాములునాయుడు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం రోడ్డు, డోలపేట వద్ద గల బాలుర వసతి గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం అంతికాపల్లి, పొగిరి సచివాలయాలను సందర్శించారు. ఏబీసీడబ్ల్యూ శ్యామలాకుమారి, డి.రాముడు, లక్ష్మీనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.