Abn logo
Sep 27 2021 @ 00:56AM

సమగ్ర దర్యాప్తుతోనే శిక్షలు అమలు: ఎస్పీ

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేశ్‌చంద్ర

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 26: పటిష్ఠమైన సాక్ష్యాలు, సమగ్ర దర్యాప్తుతోనే నిందితులకు కఠిన శిక్షలు అమలవుతాయని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. జిల్లాలో వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న పోలీసు కేసుల స్థితిగతులపై వివరణ ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆదివారం పోలీసు అధికారులతో శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందరంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో కీలకమైన పోలీసు కేసుల్లో నిందితులకు తప్పని సరిగా శిక్షలు పడే విధంగా గట్టి సాక్ష్యాల వాంగ్మూలం, రికార్డు చేయించాలని సూచించారు. డిప్యూటీ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దర్యాప్తు సమయంలోనే భౌతిక సా క్ష్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞాన సాక్ష్యాలు కీలకంగా ఉంటాయన్నా రు. పోలీసు కేసుల్లో గతంలో పోలిస్తే ప్రస్తుతం శిక్షల శాతం మెరుగు పడిందన్నారు. సమావేశంలో అడిషనల్‌ పీపీలు ముస్కు రమణారెడ్డి, సంజయ్‌కుమార్‌ వైరాగే,మధుకర్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

పోలీసులు జవాబుదారిగా ఉండాలి..

ఆపదలో ఉన్న బాధితులకు మెరుగైన సేవలందించి పోలీసులు జవాబుదారిగా ఉండాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. పోలీసు స్టేషన్‌లో పరిశుభ్రత, ఉత్తమ సేవలకు 5 ఎస్‌ విధానం అమలు తప్పని సరి చేయాలని సూచించారు. ఆదివారం పోలీసు హెడ్‌క్వాటర్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 21 పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విచారణలో ఉన్న కేసుల స్థితిగతులపై అడిషనల్‌ పీపీల సమక్షంలో వివరణ తీసుకున్నారు. 

వేలి ముద్రలు అత్యంత కీలకం..

ఆర్థిక నేరాలకు పాల్పడిన నిందితుల ఆచూకి తెలుసుకోవడానికి నేరస్థలంలో సేకరించిన వేలిముద్రలు అత్యంత కీలకమని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు హెడ్‌క్వాటర్స్‌ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో ప్రత్యేక క్లూస్‌ టీం వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్యూస్‌ టీం ఇన్‌చార్జి శ్రీనివాస్‌కు వాహన బాధ్యతలు అప్పగించారు.

పోలీసుల ఆరోగ్య సంక్షేమానికి కృషి..

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో రేయింబవళ్లు శ్రమిస్తున్న జిల్లా పోలీసుల ఆరోగ్య సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు హెడ్‌క్వాటర్‌ సమావేశ మందిరంలో పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల పై సమీక్షించారు. అలాగే విధి నిర్వహణలో రాణించిన పోలీసులకు నగదు రివార్డులు అందించి అభినందించడం జరుగుతుందని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. పోలీసు హెడ్‌క్వాటర్‌లోని సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో సమీక్షించి పోలీసులకు చప్పట్లతో అభినందించి నగదు రివార్డులను అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీ సమైజాన్‌రావు, ఏఎస్పీ హర్షవర్ధన్‌ శ్రీవాతవ్సవ్‌, షీ టీం సభ్యులు ఉన్నారు.