Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీస్‌ అధికారులు, సిబ్బందికి వ్యాయామం ముఖ్యం

- వీక్లీ పరేడ్‌లో ఓఎస్‌డీవో శరత్‌చంద్రపవార్‌

కోల్‌సిటీ, నవంబరు 27: పోలీస్‌ అధికారులు, సిబ్బంది వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని, శక్తి సామర్థ్యాలతో అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతుందని ఓఎస్‌డీవో శరత్‌చంద్రపవార్‌ పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్‌ మైదానంలో గోదావరిఖని సబ్‌డివిజన్‌ సివిల్‌, ఏఆర్‌ సిబ్బందికి వీక్లి పర్యటన నిర్వహించారు. ఓఎస్‌డీ శరత్‌చంద్ర గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్మ్స్‌, ఫుట్‌, లాఠీ, సెర్మోనల్‌ డ్రిల్‌ను సిబ్బంది ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓఎస్‌డీ మాట్లాడుతూ పరేడ్‌ వల్ల సిబ్బందికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అధికారులకు చెప్పుకునే వీలుంటుందున్నారు. వ్యక్తిగత, ఆరోగ్య, డ్యూటీ సమస్యలున్నా అధి కారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పోలీసులు చెడు అలవాట్లకు లోనుకాకుండా మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. అధికారుల ప్రవర్తన, వారి వల్ల ఏమైనా సమస్యలున్నా తెలుపవచ్చునన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, సిబ్బంది మంచి ప్రవర్తనతో ఉంటే అధికారులు కూడా సహకరిస్తారన్నారు. పోలీసులు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ పరేడ్‌లో ఏసీపీ సుందర్‌రావు, ఆర్‌ఐ మధుకర్‌, శ్రీధర్‌, విష్ణు ప్రసాద్‌, వివిధ ఠాణాలకు చెందిన ఎస్‌ఐ లు, సీఐలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement