Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటరు జాబితాపై కసరత్తు

- సవరణకు 5,094 దరఖాస్తులు 

- ఓటు హక్కు కోసం 2094  

-  జనవరి 5న తుది జాబితా 

- జిల్లాలో డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం 4,38,916 మంది ఓటర్లు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఓటరు జాబితా వెల్లడిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా ఉన్న సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో ఓటరు నమోదు, సవరణకు సంబంధించి భారీ స్పందన లభించింది. ఓటు హక్కు పొందేందుకు 2094 మంది యువతీయువకులు దరఖాస్తు చేసుకోగా సవరణలు, చేర్పులు, మార్పులకు సంబంధించి 5094 మంది దరఖాస్తులు వచ్చాయి. డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం జిల్లాలోని రెండు నియోజవర్గాల్లో 4,38,916 మంది ఓటర్లు ఉండగా 2,14,046 మంది పురుషులు, 2,24,867 మంది మహిళలు ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 2,08,427 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,00,810, మహిళలు 1,07,615 మంది, జెండర్‌ ఇద్దరు ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,30,489 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,13,236 మంది, మహిళలు 1,17,252 మంది, జెండర్‌ ఒకరు ఉన్నారు. ఇందులో ఓటరు జాబితా సవరణ అనంతరం 2022 జనవరి 5న తుది జాబితా వెల్లడించడానికి అధికారులు దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. 

కొత్త ఓటు హక్కుకు దరఖాస్తులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఓటు హక్కు పొందడానికి 2094 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలనలో 449 తిరస్కరించగా 893  ఆమోదం పొందాయి. 752 దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. ఫాం 7 ద్వారా చనిపోయిన వారి ఓటర్ల తొలగింపునకు సంబంధించి 2,498 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 20 తిరస్కరణకు గురికాగా 1111 దరఖాస్తులను ఆమోదించారు. 1367 పరిశీలనలో ఉన్నాయి. ఎడిట్‌ చేర్పులు, మార్పులకు సంబంధించి 438 దరఖాస్తులు రాగా 120 తిరస్కరించగా 146 అమోదించారు. 172 పరిశీలనలో ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు పోలింగ్‌ కేంద్రాల మార్పులకు సంబంధించి 64 దరఖాస్తులు రాగా 15 తిరస్కరణకు గురయ్యాయి. 25 ఆమోదం పొందాయి. 24 పరిశీలనలో ఉన్నాయి. సవరణ జాబితాలో వచ్చిన 5094 దరఖాస్తుల్లో 604 తిరస్కరణకు గురికాగా 2175 దరఖాస్తులకు ఆమోదం లభించింది. 2315 పరిశీలనలో ఉన్నాయి. 

జిల్లాలో 537 పోలింగ్‌ కేంద్రాలు 

జిల్లాలో వేములవాడ, సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గాల పరిధిలో 537 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వేములవాలో 255, సిరిసిల్లలో 282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేములవాడ పట్టణంలో 36 , సిరిసిల్ల పట్టణంలో 81 కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,38,916 ఓటర్లలో 133 సర్వీస్‌ ఓటర్లు ఉండగా 126 మంది పురుషులు, 7 మంది మహిళలు ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 24 మంది ఉండగా పురుషులు 20 మంది, మహిళలు ఐదుగురు ఉన్నారు. 

Advertisement
Advertisement