Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలసిన కళ్లకు ఉపశమనం

ఆంధ్రజ్యోతి(27-04-2020)

బయటకు వెళ్లే వీలు లేక, ఇంట్లోనే కూర్చొని డిజిటల్‌ తెరలు చూసి చూసి కళ్లు బాగా అలసిపోయి ఉంటాయి. అలాంటి అలసిన నేత్రాలకు ఈ వ్యాయామంతో ఉపశమనం కలుగుతుంది. ఆలస్యమెందుకు? ఇక మొదలుపెట్టండి...


బ్లింక్‌ స్లో..: కుర్చీలో కూర్చొని, మెడ, తల నిటారుగా పెట్టండి. భుజాలు రిలాక్స్‌డ్‌ మోడ్‌లో ఉండాలి. ఎదురుగా ఉన్న ఖాళీ గోడను చూడండి. ఓ క్షణం కళ్లు మూసి, తెరవండి. ఇలా పది లెక్కన రోజుకు రెండుసార్లు చేయాలి. 


నలుదిక్కులా..: నిటారుగా కూర్చొని, భుజాలు రిలాక్స్‌డ్‌గా ఉంచండి. మెడ, తల కదిలించకుండా కనుబొమ్మలను కుడి వైపు తిప్పండి. నిదానంగా సీలింగ్‌ వైపు, ఎడమ వైపు, కిందకి కదిలించండి. ఇలాగే వ్యతిరేక దిశలో కూడా చేయండి. ఇలా పది సెట్ల చొప్పున రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


ఫోకస్‌ ఛేంజ్‌: కుడి చేతి నాలుగు వేళ్లనూ మూసి, చూపుడు వేలిని మీ కళ్లకు పది అంగుళాల దూరంలో ఉంచండి. ఆ వేలుపైనే పూర్తి దృష్టి పెట్టండి. నెమ్మదిగా వేలిని పక్కకు కదిలించండి. కానీ మీ చూపు మారకూడదు. అదే డైరెక్షన్‌లో దూరంగా ఉన్న ఏదో ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించండి. ఇప్పుడు మళ్లీ చూపుడు వేలుపై దృష్టి మరల్చండి. నిదానంగా వేలిని కళ్ల దగ్గరకు తీసుకువెళ్లండి. మరలా దూరంగా ఉన్న వస్తువు చూడండి. ఇలా మూడుసార్లు చేయాలి.

Advertisement
Advertisement