ఆయుధాల ప్రదర్శన

ABN , First Publish Date - 2021-10-27T05:25:15+05:30 IST

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయుఽ ధాల ప్రదర్శనను (ఓపెన హౌస్‌) కర్నూలు రేంజ్‌ డీఐజీ పి.వెంకట్రామిరెడ్డి, ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.

ఆయుధాల ప్రదర్శన
ప్రదర్శనను పరిశీలిస్తున్న డీఐజీ పి వెంకట్రామిరెడ్డి, ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి


డీపీవోలో ఓపెన హౌస్‌ను ప్రారంభించిన డీఐజీ, ఎస్పీ

కర్నూలు, అక్టోబరు 26: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయుఽ ధాల ప్రదర్శనను (ఓపెన హౌస్‌) కర్నూలు రేంజ్‌ డీఐజీ పి.వెంకట్రామిరెడ్డి, ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. పరేడ్‌ మైదానంలో జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శన బుధవారం కూడా కొనసాగుతుంది. పోలీసు వ్యవస్థ పనితీరు, దైనందిన విధుల్లో వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని డీఐజీ, ఎస్పీ సూచించారు. పోలీసు శాఖలో చేరేలా ఈ కార్యక్రమం ద్వారా యువతలో ఉత్సాహాన్ని కలిగిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఆయుధాల గురించి ఏఆర్‌ డీఎస్పీ ఇలియాజ్‌ బాషా అవగాహన కల్పించారు. ఏ సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు? వాటి పని తీరు ఎలా ఉంటుంది? అని తెలియజేశారు. కార్యక్రమంలో సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ తుహిన సిన్హా, స్పెషల్‌ బ్రాంచ డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి, కేవీ మహేష్‌, మహబూబ్‌ బాషా, ఇలియాజ్‌ బాషా, డీఐజీ లైజనింగ్‌ ఆఫీసర్‌ సీఐ సునీల్‌ కుమార్‌, ఆర్‌ఐలు సుధాకర్‌, సురేంద్రరెడ్డి, రమణ, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ పోలీసు సిబ్బంది, టౌన మోడల్‌ స్కూల్‌, సిస్టర్‌ స్టాన్సిలాస్‌ మెమోరియల్‌ హై స్కూల్‌, కేవీఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు

బాడీవోన కెమెరాలు, డ్రోన కెమెరాలు, డాగ్‌ స్క్వాడ్‌లు, బాంబు డిస్పోజల్‌ టీమ్‌, మ్యాన ఫ్యాక్స్‌, బెస్‌ సెట్స్‌, బాడీ ప్రొటెక్టర్‌, బీపీ జాకెట్‌, ఫైబర్‌ లాళీ, స్టోన గార్డు, హెల్మెట్‌, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌, 1.5 ఫెడరల్‌ గ్యాస్‌ గన, 303 రైఫిల్‌, టియర్‌ స్మోక్‌ గ్రనైడ్‌, విల్‌ పిస్టల్‌, 9 ఎంఎం పిస్టల్‌, 9 ఎంఎం గ్లాక్‌ పిస్టల్‌, 380 రివాల్వర్‌, 9 ఎంఎం కార్బైన, 303 జీఎఫ్‌ రైఫిల్‌, 303 ఎల్‌ఎంజీ, యూజీబీఎల్‌, ఏకే 47 రైఫిల్‌, 5.56 ఇన్సాస్‌ రైఫిల్‌, 12 బోర్‌ పంప్‌ యాక్షన గన, 7.62 ఎంఎం ఎస్‌ఎల్‌ఆర్‌, 410 మస్కెట్‌, 22 రైఫిల్‌, హ్యాండ్‌ హెల్డ్‌, మెటల్‌ డిటెక్టర్‌, రాకర్‌, డ్రాగన లైట్‌, ఎక్స్‌ప్లోజివ్‌ డిటెక్టర్‌, ఎనఎల్‌జేడీ, సెల్‌ జామర్‌, ఎక్స్‌టెన్సన మిర్రర్‌, వెహికల్‌ ఇనస్పెక్షన మిర్రర్‌, బాంబ్‌ బ్లాంకెట్‌ తదితర ఆయుధాలు. 



Updated Date - 2021-10-27T05:25:15+05:30 IST