Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ వీసాపై Saudi వీడిన ప్రవాసులకు కీలక సూచన.. గడువులోపు తిరిగి సౌదీ చేరుకోకుంటే 3 ఏళ్ల బ్యాన్!

జెడ్డా: రీ-ఎంట్రీ వీసాపై సౌదీ నుంచి స్వదేశాలకు వెళ్లిన ప్రవాసులకు సౌదీ అరేబియాలోని పాస్‌పోర్ట్‌ జనరల్ డైరెక్టరేట్ తాజాగా కీలక సూచన చేసింది. వీసా గడువు ముగిసేలోపు తిరిగి సౌదీకి రాకుంటే ప్రవాసులపై మూడేళ్ల బ్యాన్ ఉంటుందని ప్రకటించింది. అంటే మూడేళ్ల వరకు ప్రవాసులు తిరిగి సౌదీ వెళ్లలేరు. ఈ రూల్ సౌదీలో ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో అధికారులు మరోసారి దీన్ని గుర్తు చేశారు. కనుక రీ-ఎంట్రీ వీసాపై స్వదేశాలకు వెళ్లిన ప్రవాసులు సాధ్యమైనంత వరకు వీసా గడువు ముగిసేలోపు సౌదీ చేరుకోవడం బెటర్. లేకుంటే మూడేళ్లు సౌదీలో కాలు పెట్టలేరు.

ముఖ్యంగా ఓ వ్యక్తి దేశం బయట ఉన్నప్పుడు రీ-ఎంట్రీ వీసాను ఎట్టిపరిస్థితిలో ఎగ్జిట్ వీసాగా మార్చడం కుదరదని ఈ సందర్భంగా పాస్‌పోర్ట్‌ జనరల్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. కానీ, మాజీ స్పాన్సర్ వద్దకు కొత్త వీసాపై వస్తే వారికి ఈ మూడేళ్ల నిషేధం నిబంధన వర్తించదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అలాగే డిపెండెంట్ వీసాపై వచ్చేవారికి కూడా ఈ రూల్ వర్తించదని తెలిపారు. వారు ఎప్పుడైన కొత్త వీసాపై సౌదీ వచ్చే వెసులుబాటు ఉందన్నారు. ఇక రీ-ఎంట్రీ వీసాపై సౌదీని వీడిన గృహకార్మికులు.. వీసా గడువులోపు తిరిగి రాకుంటే వారిని ఆరు నెలల తర్వాత తొలగించడం జరుగుతుందని పాస్‌పోర్ట్‌ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement