Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం విక్రయానికి నిరీక్షణ

కోతలు కోసి విక్రయించేందుకు సిద్ధంగా ధాన్యం 

వర్షానికి మొలకెత్తకముందే కొనుగోళ్లు చేపట్టాలంటున్న రైతులు

240 కేంద్రాలకు 12మాత్రమే ప్రారంభం

ధాన్యం సేకరించాలని డిమాండ్‌చేస్తూ నిరసనలు

రైతు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు ఆంధ్రజ్యోతి, యాదాద్రి: వరి కోతలు ఊపందుకున్నాయి. మూడు వారాల క్రితమే కోతలుకోసి, ధాన్యం విక్రయించేందుకు కల్లాల్లో సిద్ధంగా ఉంచారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంకోసం రైతులు 15 రోజులుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. అక్టోబరు చివరి వారంలోనే ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఆకాశం మేఘావృతమవుతుండడంతో రైతుల గుండెల్లో దడ పుడుతోంది. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల చిరు జల్లులతో కూడిన వర్షాలు కురుస్తుండ గా, రెండురోజులపాటు భారీగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట మట్టిపాలు కాకుండా జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నా రు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌చేస్తూ జిల్లాలోని పలు మండల్లాలో జరుగుతున్న సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీస్తున్నారు. అదేవిధంగా పలు పార్టీలు, రైతు సంఘాలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలతో ఆందోళన చేపడు తున్నారు. వారం రోజుల్లోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులు మాత్రం ధాన్యం కొనుగోళ్లు ఎప్పటినుంచి ప్రారంభిస్తారని స్పష్టత ఇవ్వాలని కోరుతూ, సేకరణ కేంద్రాల నిర్వాహకులను నిత్యం సంప్రదిస్తున్నారు. రైతుల రాకతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాతే ధాన్యాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ, భువనగిరి వ్యవసాయ మార్కెట్‌ వద్ద బోర్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వరి కోతలు పూర్తయిన ప్రాంతాల్లో ధాన్యం తడవకుండా అన్నదాతలు టార్పాలిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభించినట్లయితే రైతులకు ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో దాదాపు 2.50లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. వానాకాలంలో పండించిన పంట దిగుబడి దాదాపు 4లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వస్తుందని అధికారులు అంచనావేశారు. ధాన్యం సేకరణకు మొత్తం 240 కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వీటిలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 138 కేంద్రాలు, మార్కెట్‌ శాఖ నాలుగు కేంద్రాలు, ఐకేపీ సంఘాలు 85 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 12 కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. కేంద్రాలకు గోనెసంచులు, ధాన్యం కొలిచే కాంటాలు, తేమ పరీక్షించే యంత్రాలు, టార్పాలిన్లు తదితర సామగ్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే జిల్లావ్యాప్తంగా కోతలు ఊపందుకోవడంతో ఇప్పటికే 50శాతం మేరకు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగానే పెద్దఎత్తున కేంద్రాలను ధాన్యం వచ్చే అవకాశం ఉంది.  


రైతులపై అదనపు భారం

వరి కోతలతోపాటు ధాన్యం పట్టడానికి కూడా మిషన్లనే వినియోగిస్తున్నా రు. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. గతంలో కూలీలతో ధాన్యా న్ని తూర్పార పట్టేవారు. అయితే తాలు అధికంగా వస్తుందని, కేంద్రాల ని ర్వాహకులు తరుగు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల వెనకాలా పెద్ద ఫ్యాన్లను బిగించి వరిని తూర్పార పడుతున్నారు. వరికోత యంత్రానికి గంటకు రూ.2500 నుంచి రూ.3000, వరిని తూర్పార పట్టేందుకు గంటకు రూ.1200, ట్రాక్టర్లకు పెద్ద ఫ్యాన్లను బిగించినందుకు రూ.800వరకు ఖర్చవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరిసాగు రోజురోజుకూ ఆర్థికంగా భారమవుతోందని, ఆరుగాలం శ్రమించిన రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతున్నారు.  


ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువు రు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో కమీషన్‌ ఏజెంట్లు, దళారులకు రైతులు తక్కువ ధరకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, ధాన్యానికి మద్దతు ధర అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 15 రోజులు గా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. రైతులు ధాన్యం మార్కెట్‌, ఐకేపీ కేంద్రాల్లో రాశులు పోస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయకపోవడంతో రాశులు పేరుకుపోతున్నాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాల్లో కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు, మాయ దశరథ, పా దరాజు ఉమాశంకర్‌, యాట పెంటయ్య, లక్ష్మీనారాయణ, గౌరు శ్రీనివాస్‌, సోలిపు రం లక్ష్మీనర్సింహారెడ్డి, బయ్యని రాజు, దంతూరి సత్తయ్యగౌడ్‌, నాగవెళ్లి సుధాకర్‌గౌడ్‌, మేకల చొక్కారెడ్డి, కొంతం శంకర్‌గౌడ్‌, కేసారం కృష్ణారెడ్డి, దూసరి రాఘవేందర్‌, బడుగు జహంగీర్‌, ఎల్లేశ్‌ తిరుమల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సిద్దేశ్వర్‌, రామకృష్ణ, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మోత్కూరులో పేరుకపోయిన ధాన్యం రాశులు, తడిసిన ధాన్యా న్ని సీపీఎం బృందం పరిశీలించింది. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. భువనగి రి మండలం వడపర్తి గ్రామంలోని ఐకేపీ కేంద్రం వద్ద పేరుకుపోయిన ధాన్యాన్ని సర్పంచ్‌ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి కృష్ణారెడ్డి పరిశీలించి రైతులతో కలిసి నిరసన తెలిపారు. సంస్థాన్‌నారాయ ణపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఏర్పుల సుదర్శన్‌ మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచు కొని ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డికి భువనగిరి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శ్రీధర్‌ వినతిపత్రం అందజేశారు. 


కేంద్రాల ప్రారంభం తర్వాతే సమావేశాలు

 చౌటుప్పల్‌ మండల పరిషత్‌ సమావేశం బహిష్కరణ

చౌటుప్పల్‌ రూరల్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు మండల పరిషత్‌ సర్వసభ్యసమావేశాన్ని బహిష్కరించారు. శుక్రవారం ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉంది. సమావే శం ప్రారంభానికి ముందే కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతు సంఘం నాయకులు బైఠాయించారు. ఎంపీ పీ తాడూరి వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో బాలశంకర్‌, సిబ్బందిని అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. నెల రోజుల నుంచి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోశారని, వర్షాలతో ధాన్యం తడిసిపోతోందని వాపోయారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారో అర్థంకాక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని ఆరోపించారు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గుర వుతున్నా ప్రభుత్వం, అఽధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతుగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తర్వాతే సమావేశం ఏర్పాటుచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, ఎంపీటీసీలు కొండల్‌రెడ్డి, ఈశ్వరమ్మ, వెంకటేశం, తడక పారిజాత, సర్పంచ్‌లు కాయితి రమే్‌షగౌడ్‌, వెల్వర్తి యాదగిరి, గుడ్టెడి యాదయ్య, రైతు సంఘం నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, గంగాదేవి సైదులు తదితరులు పాల్గొన్నారు. 


ధాన్యం కొనుగోలు చేయాలి

గుండాల:వరి కోతలుకోసి నెలరోజులు కావస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయలేదని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మండలంలోని వెల్మజాల గ్రామానికి చెందిన మహిళా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సంగి అలివే లు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాని కి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం మొలకెత్తి రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని, వెంటనే ధాన్యా న్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో లక్ష్మి, యశోద, సంగి లక్ష్మి, యాదమ్మ, పధ్మమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement