Abn logo
Sep 15 2021 @ 00:05AM

ప్రయోగాత్మకంగా నల్లవరి సాగు

వలసబల్లేరులోని నల్ల వరి రకం సాగును పరిశీలిస్తున్న ఏవో అమరాశివ

కురుపాం రూరల్‌: కురుపాం మండలంలోని వలసబల్లేరు రైతులు నల్లవరి రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. గత ఏడాది వలసబల్లేరు రైతులు ఓ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు వెళ్లి  అరకిలో నల్ల ధాన్యం విత్తనాలను తెచ్చారు. వాటిని సాగు చేసి రెండు బస్తాల దిగుబడి సాధించారు. జిల్లాలోని 34  మంది రైతులకు వీరు నల్ల ధాన్యాన్ని పంపిణీ చేశారు. వీరంతా సేంద్రీయ పద్ధతిలో నల్ల ధాన్యాన్ని సాగుచేస్తున్నారు. నల్లని చేను, నల్లని ధాన్యంతో పంట చూపరులను ఆకట్టుకుంటోంది. మంగళవారం నాడు మండల వ్యవసాయ అధికారి అమరా శివ వలసబల్లేరు గ్రామంలోని నల్ల వరి సాగును పరిశీలించి రైతులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు.