ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకతను వివరించాలి

ABN , First Publish Date - 2021-10-26T06:08:42+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యక తను రైతులకు వివరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ సంబందిత అధికారులను ఆదేశించా రు.

ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకతను వివరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

- కలెక్టర్‌  డాక్టర్‌ సంగీతసత్యనారాయణ

పెద్దపల్లి,  అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యక తను రైతులకు వివరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ సంబందిత అధికారులను ఆదేశించా రు. ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికపై సోమవారం వ్యవసాయాధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించా రు. సీఎం సూచనల మేరకు మండల వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పంటల సాగుపై పక్కా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. వరికి బదులు గా శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, కందులు, పెసర, తదితర పంటలు పండించేలా వారికి అవగా హన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అవసరమై న విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచే విధంగా డీలర్లతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో రైతులెంత మంది ఉన్నారు వారు ఏఏ పంటలు ఎంత మేరకు వేశారో వివరాలతో జాబితా రూపొందించాలన్నారు. ఈసారి ఎఫ్‌సీఐ వరిని సేకరించడంలేదని యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయ డం కుదరదన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రైతువేదికలలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్య కత గురించి సమావేశాలు నిర్వహించాలని ఆదేశిం చారు.  యాసంగిలో రైతులు తమ సొంత పూచీక త్తుతో మాత్రమే వరి సాగు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసా యాధికారి తిరుమల్‌ప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి, మండల ఏఈవో తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T06:08:42+05:30 IST