Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేలిన ఫ్లైయాష్‌ ట్యాంకర్‌

తృటిలో తప్పిన ప్రమాదం


మైలవరం, డిసెంబరు 7: మైలరవం మండల పరిధిలోని దాల్మియా పరిశ్రమలో  మంగళవారం సాయంత్రం ఫ్లైయాష్‌ ట్యాంకర్‌కు లోడ్‌ నింపుతుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్‌ పేలింది. ఆ సమయంలో కార్మికులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ధర్మల్‌, నెల్లూరు నుంచి దాల్మియా పరిశ్రమకు ఫ్లైయాష్‌ కోసం ట్యాంకర్లు వస్తుంటాయి. ఇలా వచ్చిన వాటిలో ఒకటి ఒక్కసారిగా పేలడంతో ట్యాంకర్‌ డోర్‌లు స్టోర్‌ యార్డు సమీపంలో ఎగిరి పడ్డాయి. ఆ సమయంలో డ్రైవర్‌ గాలి నింపే ప్రాంతంలో, కార్మికులు దూరంగా పనులు చేసుకుంటూ ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. కానీ ట్యాంకర్‌ పేలడంతో కార్మికులందరూ ఆందోళనకు గురయ్యారు. 

Advertisement
Advertisement