Abn logo
Sep 19 2021 @ 22:56PM

గజ్వేల్‌లో పేలిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

మంటల్లో గజ్వేల్‌ 132కేవీ సబ్‌స్టేషన్‌


గజ్వేల్‌, సెప్టెంబరు 19: గజ్వేల్‌ పట్టణంలోని 132 కేవీ సబ్‌ స్టేషన్‌ పేలిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారిగా సబ్‌ స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో సబ్‌ స్టేషన్‌ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందిచండంతో ఫైర్‌ ఇంజన్లు సబ్‌ స్టేషన్‌కు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా వినాయక నిమజ్జనాల వేళ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.