Abn logo
Aug 15 2020 @ 04:49AM

కరోనా పేరుతో దోపిడీ దుర్మార్గం

 సీపీఎం ఉత్తరప్రాంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌


అనంతపురం టౌన్‌, ఆగస్టు 14: కరోనా మహమ్మారి విజృంభించి ప్రజలు భయాందోళన చెందుతుంటే.. దీనిని ఆసరా చే సుకుని ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతుండడం దుర్మార్గమని సీపీఎం జిల్లా ఉత్తరప్రాం త కార్యదర్శి రాంభూపాల్‌ విమర్శించారు. సూపర్‌స్పెషాలిటీ ఆ స్పత్రిని ప్రారంభించాలని, సర్వజనాస్పత్రిలో సాధారణ రోగులకు వైద్యమందించాలని, క్వారంటైన్‌ కేంద్రాల్లోని అక్రమాలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సీపీఎం, అనుబంధ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక క్లాక్‌టవర్‌ వద్ద నిరసన చేపట్టారు.


  ఆయన మాట్లాడుతూ కరోనా వైర్‌సను బూచిగా చూపించి ప్రభుత్వం లూటీకి పాల్పడుతోందన్నారు. క్వారంటైన్‌ కేంద్రాలు, కొవిడ్‌ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.  ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ రోగులకు వైద్యమందకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆసరా చేసుకుని నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్‌, జిల్లా నాయకులు రామిరెడ్డి, నాగప్ప, మన్నీల రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరంగయ్య, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రాజమోహన్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్‌, సురేంద్ర, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement