Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేదల దోపిడీకే.. ఓటీఎస్‌

అంబేడ్కర్‌ విగ్రహాల ఎదుట తెలుగు తమ్ముళ్ల నిరసన

జీవో రద్దు చేయాలంటూ డిమాండ్‌ 


గుంతకల్లు, డిసెంబరు 6: పాలన చేతకాక ఆర్థిక సం క్షోభంలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం.. గృహ హక్కు పథకం ఓటీఎస్‌ ముసుగులో పేదల దోపిడీకి తెగబడిందని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు విమర్శించారు. ఓ టీఎస్‌ పేరుతో గృహ లబ్ధిదారుల నుంచి బలవంతపు వ సూళ్లకు పాల్పడుతున్న విధానాన్ని వెంటనే రద్దు చేయాల ని డిమాండ్‌ చేస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో నిరస నలు చేపట్టారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని  రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించి, ప్రభుత్వ దోపిడీ పై తెలుగు తమ్ముళ్లు నిరసనకు దిగారు.  మున్సిపల్‌ కార్యాలయం వద్ద జితేంద్రగౌడు మాట్లాడుతూ అధికారంలోకి వ చ్చిన రెండున్నరేళ్లలో సీఎం జగన రాషా్ట్రన్ని గుల్లచేశాడని, పేదలను వివిధ పద్ధతుల్లో దోపిడీ చేస్తున్నాడని ఆరోపిం చారు. రాషా్ట్రన్ని ఆర్థికంగా నీచస్థాయికి దిగజార్చి సామాన్య జనంపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాడన్నారు. పన్నులు, క రెంటు, ఇంధనాల ధరలను ఇష్టారాజ్యంగా పెంచడం ద్వా రా ప్రజలను దోచుకున్నాడన్నారు. ఇప్పుడు ఓటీఎస్‌ పేరిట నిరుపేదలను అప్పులపాలు చేసైనా డబ్బును వసూలు చే యడానికి ఉద్యుక్తుడయ్యాడన్నారు. పేదలకు ఉచితంగా ఇంటి రిజిస్ట్రేషన చేసివ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు అ నవసరంగా డబ్బును చెల్లించవద్దన్నారు. రానున్న రోజుల్లో తమ పార్టీ పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తుందన్నారు. టీడీపీ జిల్లా మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి కేసీ హరి మాట్లాడుతూ టిడ్కో ఇళ్లకు డబ్బు చెల్లించవద్దని, అ ధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఉచితంగా ఇస్తామని నమ్మించిన జగన పేదలను నిలువునా ముంచాడన్నాన్నా రు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు పవన కుమార్‌ గౌడు, గుడిపాటి ఆంజనేయులు, పార్లమెంటు కార్యదర్శి ఆ టో ఖాజా, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తలారి మస్తానప్ప, మాజీ కౌన్సిలర్లు హనుమంతు, లక్ష్మినారాయణ, సంజీవులు, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి జింకల జగన్నాథ్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర కార్యదర్శి కే సురేశ, నాయకులు బండారు రామన్న చౌదరి, బొజ్జేనాయక్‌, శ్రీధర్‌, శీన, మాధవి పాల్గొన్నారు. 


‘పేదల ఇళ్లకు ఉచితంగా రిజిసే్ట్రషన చేయిస్తాం’

గుత్తి: గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన ఇళ్లపై వైసీపీ ప్ర భుత్వం ఓటీఎస్‌ పేరుతో దోపిడీ చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌ పేర్కొన్నారు. సోమవా రం ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటీఎస్‌ కట్టకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని అధికారులు బెదిరిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుగు చెందారన్నారు. ఎవ్వరూ ఓటీఓస్‌ కింద డబ్బులు చెల్లించద్దన్నా రు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన చేయించి ఇస్తామన్నారు. నిరసనలో టీడీపీ మం డల కన్వీనర్‌ బర్దీవలి, టౌన బ్యాంకు అధ్యక్షుడు అబ్దుల్‌ జి లాన, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి దిల్‌కా శీన, టౌన బ్యాంకు ఉపాధ్యక్షుడు కృష్ణ, వెంగన్నపల్లి సర్పంచ భరత కుమార్‌, నాయకులు శ్రీనివాస యాదవ్‌, వీరభద్రయ్య, రవిశంకర్‌ గౌ డ్‌, ఎంకే చౌదరి, రంగారెడ్డి యాదవ్‌, సుధాకర్‌ నాయుడు, బోర్‌వెల్‌ నాగరాజు, టైలర్‌ బాషా, శ్రీనివాసచౌదరి, వేణు, సుంకన్న, గోవిందు పాల్గొన్నారు.


పనులే లేని పరిస్థితుల్లో పేదలతో వసూళ్లు దుర్మార్గం

వజ్రకరూరు: ఓటీఎస్‌ పేరుతో పేదలను వైసీపీ ప్రభు త్వం దోపిడీ చేస్తోందని టీడీపీ మండల కన్వీనర్‌ నూతేటి వెంకటేశ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు, కూలీలకు పనులు దొర క్క ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. టీ డీపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన చే యిస్తామన్నారు. ప్రజలు ఓటీఎస్‌ చెల్లించద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుధాకర్‌, మండల నాయకులు నాగేంద్ర, ఓబులేశు, వెంకటేశ, సర్పంచ సుదీప్‌, మనోహర్‌ పాల్గొన్నారు.


ఆర్ధిక వెసులుబాటుకు ప్రభుత్వ ఎత్తుగడ

కళ్యాణదుర్గం: ఉద్యోగుల జీతాలు చెల్లించలేని అసమ ర్థ సీఎం జగన... ఆర్థిక వెసులుబాటుకు ఓటీఎస్‌ ఎత్తుగడ వేసి పేదలతో దోచుకుంటున్నారని నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ధ్వజమెత్తారు. ఓటీఎస్‌ విధానానికి నిరసనగా స్థానిక ఎన్టీఆర్‌ భవన నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అం బేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం అందజేశా రు. ఈసందర్భంగా ఉమా మాట్లాడుతూ టీడీపీ హయాం లో పక్కాగృహాలను నిర్మించి ఇస్తే.. వైసీపీ ప్రభుత్వం కొత్తఎత్తుగడ వేసి ఓటీఎస్‌ పేరుతో పేదలను దోచుకుంటోందని విమర్శించారు. లబ్ధిదారులెవరూ సచివాలయాల్లో రిజిస్ట్రేషన చేసుకోవద్దని సూచించారు. నిరసనలో నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, తలారి సత్యప్ప, రామరాజు, శ్రీరాములు, కొల్లప్ప, పోస్టు పాలన్న, నాగరాజు, రోషన, జయరాములు, బిక్కి గోవిందరాజులు, హరి, మొద్దుల వెంకటేశులు, హనుమంతరాయుడు, శీన, ఉమేష్‌ పాల్గొన్నారు. 


ఓటీఎస్‌ పచ్చి మోసం 

గృహ హక్కు పథకం ఓటీఎస్‌ పచ్చిమోసమని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు విమర్శించారు. సోమవారం శెట్టూరు మండలం ములకలే డు, పెరుగుపాళ్యం గ్రామాల్లో ఆయన గౌరవ సభ నిర్వహించారు. స్థానిక పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. ఓటీఎస్‌ను నమ్మి ప్రజలు మోసపోరాదని తెలియజేశారు.  టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి లబ్ధిదారునికి ఉచితంగా రిజిస్ట్రేషన చేయించిఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో నాయకులు మాదినేని మురళి, తలారి సత్యప్ప, రామరా జు, తిప్పారెడ్డి, నగేష్‌, రంగనాయకులు పాల్గొన్నారు. 


చిత్తశుద్ధి ఉంటే ఓటీఎ్‌సను రద్దు చేయాలి

వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓటీఎస్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి డిమాండ్‌ చేశారు. ఇందుకు నిరస నగా కళ్యాణదుర్గంలో ఎన్టీఆర్‌ భవన నుంచి అంబేడ్కర్‌ వి గ్రహం వరకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీచేపట్టా రు. అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి నిరసన చేపట్టా రు. ఉన్నంతో పాటు సీనీయర్‌ నాయకులు చౌళం మల్లికార్జున మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రం సంక్షోభం లో పడిందన్నారు. అప్పుల కుప్ప నుంచి తేరుకునేందుకే ఓ టీఎస్‌ ద్వారా పేదల డబ్బును గుంజుతుండడం సిగ్గుచేటన్నారు. ఓటీఎస్‌ విధానాన్ని ప్రజలు నమ్మరాదని తెలియజేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇ ళ్లను రిజిస్ట్రేషన చేయించే బాధ్యత చంద్రబాబునాయుడు తీ సుకుంటున్నట్లు ప్రకటించారన్నారు. అనంతరం ఆర్డీఓ ని శాంతరెడ్డి, హౌసింగ్‌ ఏఈ రామ్మోహనలకు ఓటీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్జీ శివశంకర్‌, పాపంపల్లి రామాంజినేయులు, జీపీ నారాయణ, గోళ్ల వెంకటేశులు, ఆవుల తిప్పేస్వామి, మల్లికార్జున, గౌని శ్రీనివాసరె డ్డి, ఊటంకి రామాంజినేయులు, డీకే రామాంజినేయులు, ఒంటిమిద్ది సత్తి, హనుమంతరెడ్డి, గోవిందరెడ్డి, రాయపాటి రామాంజినేయులు, రంగప్ప, మల్లికార్జున, గరికపాటి కిషో ర్‌, కొల్లాపురప్ప, నారాయణ, రామన్న, గోళ్ల రాము, భాస్కర్‌, బసవరాజు, కుణేసాయినాథ్‌ పాల్గొన్నారు.


లబ్ధిదారులెవరూ పైసా చెల్లించొద్దు..

ఉరవకొండ: ఓటీఎ్‌సను లబ్ధిదారులు ఎవ్వరూ పైసా చెల్లించద్దని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఓటీఎ్‌సను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం అంబేడ్కర్‌ వి గ్రహం వద్ద నాయకులు నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ వి గ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా  మా ట్లాడుతూ టీడీపీ హయాంలో కట్టిన గృహాలకు ఓటీఎ్‌సను చెల్లించాలంటూ వలంటీర్లపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. మ హిళల పొదుపు ఖాతాల నుంచి బలవంతంగా డ్రా చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఓటీఎ్‌సను రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేవినేని పురుషోత్తం, రేగాటి నాగరాజు, మండల కన్వీనర్‌ విజయ భాస్కర్‌, పట్టణ కన్వీనర్‌ రామాంజినేయులు, నాయకులు ప్యారం కేశావనంద, గోవిందు, రాజేష్‌, సుంకన్న, జగదీష్‌, వరప్రసాద్‌, పెద్దన్న, నాగరాజు, పల్లా నరసింహులు, ఈడి గ వేణు, తాజుద్దీన పాల్గొన్నారు.


ఓటీఎస్‌ రద్దు చేయాల్సిదే..

కంబదూరు: ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేద ప్రజల నుంచి నిలువుదోపిడీ చేస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ క కార్యదర్శి కరణం రామ్మోహన చౌదరి ధ్వజమెత్తారు.  ఓ టీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అంబేడ్కర్‌ వి గ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటీఎస్‌ విధానాన్ని రద్దుచేయకపోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో గుంజడం దుర్మార్గమైన ఆలోచనన్నారు. పేద ప్రజలకు అండగా పోరాటంచేసేందుకు టీడీపీ సిద్ధంగా వుందన్నారు. ఓటీఎస్‌కు స్వస్తి పలికి పేద ప్రజలకు వి ముక్తి కల్గించి ప్రభుత్వానికి మంచి బుద్ధి ఇవ్వాలని అంబేడ్కర్‌ విగ్రహానికి విన్నవించారు. కార్యక్రమంలో మండల క న్వీనర్‌ శివన్న, నాయకులు బాబయ్య, సుబ్బరాయుడు, మ ల్లికార్జున, తిమ్మరాయుడు, శ్రీనివాసులు, గంగాధర, ప్రభాక ర్‌, నాగరాజు, రాజశేఖర్‌, మారుతి, రాజా, రామకృష్ణ, ము త్యాలు, సికిందర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


పేదల నడ్డి విరుస్తున్న వైసీపీ 

బెళుగుప్ప: పక్కా గృహాలు పొందిన పేదల నడ్డివిరిచేందుకే వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున ఆరోపించారు. మండలంలోని గుండ్లపల్లి క్రాస్‌ వద్ద టీడీపీ నాయకులు ఓటీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహాని కి వినతిపత్రం ఇచ్చారు. మీరైనా కళ్లు తెరిపించాలని విన్నవించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈవిధానాన్ని రద్దుచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ ప్రసాద్‌, నరసాపురం అరవింద్‌, సర్పంచు రాము, ఎర్రిస్వామి, తిప్పేస్వామి, శివప్ప, దేవప్ప, ఓబులేశు, రాజావళి, రుద్రయ్య, బాలాజీ, అంగడి శ్రీరాములు, తిప్పేస్వామి, అంజి, మారె ప్ప, చంద్ర, ఎర్రిస్వామి పాల్గొన్నారు. 


నిరుపేదలపై ఒత్తిడి..

కూడేరు : ప్రభుత్వం నిరుపేదలపై ఓటీఎస్‌ విధానంతో డబ్బులు వసూలు కోసం ఒత్తిడి పెంచుతున్నారని, తక్షణం ఈవిధానాన్ని రద్దు చేయాలని టీడీపీ నాయకులు డిమాం డ్‌ చేశారు. సోమవారం అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా వి గ్రహానికి టీడీపీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. తక్షణం పేదల గృహాలకు డబ్బులు వసూలు చేసే విధానా న్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఎంపీడీఓ సూపరింటెండెంట్‌ వీరాంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయప్రకాష్‌ గౌడ్‌, కొర్రకోడు కుంటెన్న, బొమ్మయ్య, బాట వెంకటేష్‌, బొమ్మినేని శ్రీధర్‌, కురుగుంట ప్రసాద్‌, మద్దినేని వెంకటనాయుడు, పార్కు రామాంజనేయులు, సన్న, మునీంద్ర, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


ఓటీఎస్‌ అమానుషం

పామిడి: రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో గృహనిర్మా ణ లబ్ధిదారులతో రిజిస్ట్రేషన నెపంతో డబ్బులు వసూలు చే యడం అమానుషమని తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ వి గ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై ఆర్థి క భారాన్ని మోపడం సరికాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుతో అసంతృప్తిగా ఉన్నారన్నారు. నిరసన కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఓ బులేశు, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటయ్య, ఎస్పీ జనసంఘం రాష్ట్ర కార్యదర్శి సాకే ఓబులేశు మద్దతిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ముసలిరెడ్డి, పార్లమెంట్‌ జిల్లా కార్యదర్శి రాజేష్‌ నాయక్‌, మాజీ కౌన్సిలర్లు వై యూ రామాంజినేయులు, మహబుబ్‌బాషా, టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జింకల రామకృష్ణ, వడ్డే శివకుమార్‌, సీనియర్‌ నాయకులు నారాయణ స్వామి, రా మాంజినేయులు, బొమ్మా మోహన కృష్ణ, సుదర్శన, వెంకటే శ, గంపమల్లయ్య, బాలరాజు, రాజు పాల్గొన్నారు.


జీవించే హక్కును కాలరాస్తున్న ప్రభుత్వం

రాయదుర్గం టౌన: రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్‌ క ల్పించిన జీవించే హక్కును ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొరాళ్లు పురుషోత్తమ్‌ ఆరోపించారు. పట్టణంలో టీడీపీ నా యకులు అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా టీడీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఓటీఎస్‌ పేరుతో ప్రజలను వేధిస్తున్న ఘటనలపై అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు సిమెంటు శీన, ఆనంద్‌, నాగరాజు, నవీన, రవిచంద్ర, జమీల్‌ ఖాన పాల్గొన్నారు. 


రాయదుర్గంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు


Advertisement
Advertisement