యోగి ఆదిత్యనాథ్‌కు పేలుడు పదార్థంతో బెదిరింపు లేఖ

ABN , First Publish Date - 2022-01-26T17:08:34+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు లేఖతో పేలుడు పదార్థం పంపిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది....

యోగి ఆదిత్యనాథ్‌కు పేలుడు పదార్థంతో బెదిరింపు లేఖ

భోపాల్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు లేఖతో పేలుడు పదార్థం పంపిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా పట్టణంలో టైమరుతో కూడిన పేలుడు పదార్థాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. ఘటనా స్థలంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను బెదిరిస్తూ లేఖ లభించింది. జాతీయ రహదారి-30పై వంతెన కింద బెదిరింపు లేఖతో పేలుడు పరికరాన్ని పోలీసులు గుర్తించారు. పరికరం లభ్యమైన వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది.మధ్యప్రదేశ్‌లోని రేవా డివిజన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.ఈ బెదిరింపు లేఖ, పేలుడు పదార్థం లభ్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


వచ్చే నెలలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు ఉగ్రవాద ముప్పు భయాన్ని పెంచుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు లేఖతోపాటు పేలుడు పదార్థం పంపిన ఘటన సంచలనం రేపింది.దీంతో యూపీలో సీఎం యోగికి భద్రతను పెంచారు.


Updated Date - 2022-01-26T17:08:34+05:30 IST