జూనియర్‌ కాలేజీల ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-22T09:09:21+05:30 IST

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌, అదనపు సెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ ఒక

జూనియర్‌ కాలేజీల ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌, అదనపు సెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పెనాల్టీ లేకుండా జూన్‌ 30 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో జూలైౖ 7 వరకు ,రూ.3,000 ఆలస్య రుసుంతో జూలై 14 వరకు, రూ.5,000 ఆలస్య రుసుంతో జూలైౖ 21 వరకు, రూ.10,000 ఆలస్య రుసుంతో జూలై 28 వరకు, రూ.15,000 ఆలస్య రుసుంతో ఆగస్టు 4 వరకు, రూ.20,000 ఆలస్య రుసుంతో ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అఫిలియేషన్‌ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించుకోవాలన్నారు.  

Updated Date - 2021-06-22T09:09:21+05:30 IST