Abn logo
May 5 2021 @ 00:18AM

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి గడువు పెంపు

ఆదిలాబాద్‌టౌన్‌, మే4: ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి గాను దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు బంగారుగూడ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్‌ మండలంలోని అనుకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారుగూడ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి, 7, 8, 9,10 తరగతుల్లో ప్రవేశానికి గాను గడువును ఈ నెల 8వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు పేర్కొన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.150, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.75 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన ప్రతిని తగిన ధ్రువీకరణ పత్రాలతో పాఠశాలల్లో ఈ నెల 9వ తేదీలోపు సమర్పించాలన్నారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8, 9,10 తరగతులలో మిగిలిన సీట్లకు ప్రవేశం ఉంటుందని తెలిపారు. అయితే హాల్‌టికెట్లను జూన్‌ 1, 2021 తేదీ నుంచి అదే నెల 6వ తేదీ లోపు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి గాను జూన్‌ 6వ తేదీన ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుందని, 7,8,9,10 తరగతులలో ప్రవేశానికి గాను జూన్‌ 5వ తేదీ శనివారం ఉంటుందన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌టౌన్‌, మే4:స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా హైదరాబాద్‌ జోన్‌ తెలంగాణలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు (కస్టమర్‌ సపోర్టు అండ్‌ సేల్‌) 275 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసిందని అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జోగుఫౌండేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, లేదా డిగ్రీ ఫైనలీయర్‌, సెమిస్టర్‌ చదువుతున్న వారు కూడా ఆన్‌లైన్‌లో ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. యువకులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement