ఆసరా పింఛన్ల గడువు పెంపు

ABN , First Publish Date - 2021-10-13T06:09:29+05:30 IST

ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య పింఛన్ల మం జూరుకు అర్హత వయస్సును తగ్గించిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది.

ఆసరా పింఛన్ల గడువు పెంపు

- ఆగస్టు నెలాఖరుతో ముగిసిన గడువు

- మరో సారి అవకాశం కల్పించిన ప్రభుత్వం

- నేటి నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య పింఛన్ల మం జూరుకు అర్హత వయస్సును తగ్గించిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈనెల 14వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిం ది. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి అర్హులైన వారికి పిం ఛన్లు మంజూరు చేస్తా మని హామీ ఇచ్చారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేరకు పింఛన్ల మంజూరును ప్రభుత్వం మరిచింది. అర్హత వయస్సును తగ్గించిన ప్పటికీ, రెండున్నరేళ్లుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించ లేదు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, అధికార పార్టీ ప్రజాప్రతి నిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీ నుంచి అదే నెల 31వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గడువు ముగిసే నాటికి జిల్లా వ్యాప్తంగా 20,578 మంది 57 సంవత్స రాలు నిండిన వాళ్లు వృద్ధాప్య పింఛన్‌ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతర్గాం మండలంలో 590, ధర్మారం మండలం లో 1288, ఎలిగేడు మండలంలో 706, జూలపల్లి మండలంలో 1152, కమాన్‌పూర్‌ మండలంలో 849, మంథని మండలంలో 1604, ముత్తారం మండలంలో 761 దరఖాస్తులు వచ్చాయి. ఓదెల మండలంలో 1202, పాలకుర్తి మండలంలో 1098, పెద్దపల్లి మండ లంలో 2985, రామగిరి మండలంలో 1004, రామ గుండం మండలంలో 4006, కాల్వశ్రీరాంపూర్‌ మండ లంలో 1535, సుల్తానాబాద్‌ మండలంలో 1798 దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంచాలని ప్రతి పక్షాలు కోరినప్పటికీ, ప్రభుత్వం పట్టించు కోలేదు. సెప్టెంబరు మాసంలో వచ్చిన దరఖా స్తులను పరిశీలించి అర్హులను గుర్తించి అక్టోబర్‌ నెల నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన వారికి 2,016 రూపాయల చొప్పున పింఛన్‌ చెల్లి స్తారని భావించారు. కానీ ప్రభుత్వం వచ్చిన దరఖాస్తులను ఇప్పటి వరకు పరిశీలించ లేదు. అసెంబ్లీ సమావే శాల సందర్భంగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకు నేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరిన మేరకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకు నేందుకు గడువు విధిం చింది. ఈ విషయమై 57 సంవత్సరాలు నిండి ఉండి అర్హత గల వాళ్లు వృద్ధాప్య పింఛన్‌ మంజూరు కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి శ్రీధర్‌ కోరారు.

Updated Date - 2021-10-13T06:09:29+05:30 IST