Abn logo
Apr 9 2021 @ 02:51AM

జాతీయ భద్రతా చట్టం కింద కలెక్టర్‌ అధికారాలకు గడువు పొడిగింపు

కలికిరి, ఏప్రిల్‌ 8: జాతీయ భద్రతా చట్టం-1980 కింద కలెక్టరుకున్న అధికారాల వినియోగానికి సంబంధించిన గడువును మరో మూడు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర.. ప్రజల భద్రతకు, సమాజానికి అత్యవసరమైన సరఫరాలు, సేవలకు హానికరంగా పరిణమించే వ్యక్తులను ముందస్తుగా నిర్బంధించే అధికారాలు  కలెక్టరుకు ఈ చట్టం ద్వారా సంక్రమించాయి. ఈ అధికారాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. దీంతో గడువు పొడిగించాల్సిందిగా ఇంటిలిజెన్స్‌ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ చేసిన సూచనల మేరకు మరో మూడు నెలలు (జూలై 15 వరకు) పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement
Advertisement
Advertisement