విస్తృత దాడులు నాటుసారాపై కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-10-17T04:54:50+05:30 IST

అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై విస్తృతదా డులు నిర్వహించినట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ కల్యా ణ్‌కుమార్‌ తెలిపారు.

విస్తృత దాడులు నాటుసారాపై కేసులు నమోదు
బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న ఎస్‌ఈబీ పోలీసులు

పులివెందుల టౌన్‌, అక్టోబరు 16: అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై విస్తృతదా డులు నిర్వహించినట్లు ఎస్‌ఈబీ ఎస్‌ఐ కల్యా ణ్‌కుమార్‌ తెలిపారు. ముదిగుబ్బ రింగ్‌ రో డ్డు వద్ద నగరిగుట్ట వా సి గంగనపల్లె గంగాధ ర్‌ వద్ద కర్ణాటక రాష్ట్రా నికి చెందిన ఐదు ఫుల్‌ బాటిళ్లు మద్యం సీజ్‌ చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లె నివాసి కల్లూరు దామోదర్‌రెడ్డి బట్టీవద్ద నాటుసారా తయారీకి బెల్లం ఊట సిద్దం చేస్తుం డగా 300లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరి కి పులివెందుల కోర్టు 14రోజుల రిమాండ్‌ విధించిన ట్లు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వర్‌రెడ్డి, గీత, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T04:54:50+05:30 IST