పోలీసుల విస్తృ తనిఖీలు

ABN , First Publish Date - 2021-05-18T04:48:58+05:30 IST

కరీంనగర్‌లో సోమవారం రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాజీవ్‌చౌక్‌లో పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షణలో వాహనదారులను తనిఖీ చేసి అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేసి కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్‌కు తరలించారు.

పోలీసుల విస్తృ తనిఖీలు
వాహనాలను తనిఖీ చేస్తున్న సీపీ కమలాసన్‌ రెడ్డి, పోలీసు అధికారులు

 పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, మే 17 : కరీంనగర్‌లో సోమవారం రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాజీవ్‌చౌక్‌లో పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షణలో వాహనదారులను తనిఖీ చేసి అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సీజ్‌ చేసి కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్‌కు తరలించారు.  కొవిడ్‌ పేషెంట్‌లకు  భోజనం ఇచ్చేందుకంటూ,  మందులకు అంటూ పలువురు రోడ్లపై తిరుగుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్‌లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను, ఈ పాస్‌లు, ధ్రువీకరణ పత్రాలను క్షున్నంగా పరిశీలించిన మీదటనే అనుమ తిస్తున్నారు. కరీంనగర్‌లోని అన్ని చెక్‌పోస్ట్‌లను రాత్రి పోలీస్‌కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి తనిఖీ చేశారు. సీపీ వెంట అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌, జజీ చంద్రమౌళి, పీ అశోక్‌, సీఐలు లక్ష్మిబాబు, నటేష్‌ తదితరులున్నారు.



కొవిడ్‌ సేవల్లో వలంటీర్లకు అవకాశం

 నిబంధనలు అతిక్రమించిన వారిపై 1,472 కేసులు

 357 వాహనాల సీజ్‌

 పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి 


కరీంనగర్‌ క్రైం, మే 17 : కొవిడ్‌ సేవల్లో స్వచ్ఛందంగా పనిచేసే వలంటీర్ల సేవలు సద్వినియోగం చేసుకుంటామని, గతంలో పనిచేసిన వారికి ప్రాధాన్యతనిచ్చే అవకాశాలను పరిశీలిస్తామని పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయల మార్కెట్‌లు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద ప్రజలు భౌతికదూరం పాటించేలా సేవలందించడం, కొవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పించడం వంటి సేవలకు వలంటీర్లను వినియోగించ నున్నామని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటామన్నారు. మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. వీరి పర్యవేక్షణ బాధ్యత సిటీ అడిషనల్‌ డీసీపీ పీ అశోక్‌కు అప్పగించామని సీపీ తెలిపారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా స్వచ్ఛందంగా పనిచేసే స్థానిక వలంటరీల సేవలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మంగళవారం ఉదయం వరకు 1,472 కేసులు నమోదు చేశామని, ఇందులో మాస్క్‌లు ధరించని 703 మందిపై, భౌతికదూరం పాటించని 209 మందిపై, ఎక్కువ సంఖ్యలో  గుమికూడిన సందర్భాలలో 48 మందిపై, లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు సంబంధించి 488 మందిపై ఇతర 24 కేసులు నమోదు చేశామని, ఏ పనీలేకుండా, ఈ పాస్‌ లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 357 వాహనాలను సీజ్‌ చేశామని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2021-05-18T04:48:58+05:30 IST