Abn logo
Sep 25 2021 @ 21:08PM

కంభంపాడులో పూడ్చిన మృతదేహం వెలికితీత

గుంటూరు: జిల్లాలోని మాచర్ల మండలంలో గల కంభంపాడులో పూడ్చిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. కంభంపాడుకు చెందిన శశిధర్ జూన్ 24న మృతి చెందాడు. సాధారణ మరణంగా భావించి కుటుంబ సభ్యులు ఖననం చేసారు. వేరే కేసులో అరెస్టు చేసిన మహిళ ఇచ్చిన సమాచారంతో శశిధర్‌ది హత్యగా పోలీసులు తేల్చారు. శశిధర్‌కు సైనేడ్ ఇచ్చినట్లు పోలీసులకు మహిళ తెలిపింది. శశిధర్ మృతదేహాన్ని వెలికితీసి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోలీసులు, రెవిన్యూ అధికారుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...