ఎటు చూసినా ‘ఆర్థిక’ అంధకారం

ABN , First Publish Date - 2020-06-05T06:15:49+05:30 IST

కరోనా వైర్‌సతో ఎటు చూసినా ‘ఆర్థిక’ అంధకారం కనిపిస్తోంది. ఆదాయా లు పడిపోతున్నాయి. వినియోగదారులు ఖర్చులకు వెనుకాడుతున్నారు. తప్పనిసరైతే తప్ప, ఖర్చులకు పోవడం లేదు...

ఎటు చూసినా ‘ఆర్థిక’ అంధకారం

ముంబై: కరోనా వైర్‌సతో ఎటు చూసినా ‘ఆర్థిక’ అంధకారం కనిపిస్తోంది. ఆదాయా లు పడిపోతున్నాయి. వినియోగదారులు ఖర్చులకు వెనుకాడుతున్నారు. తప్పనిసరైతే తప్ప, ఖర్చులకు పోవడం లేదు. దీంతో మే నెలలో ఆర్థిక భవిష్యత్‌పై వినియోగదారుల నమ్మకం గతం లో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా, చాలామందికి ఆర్థిక భవిష్యత్‌ ఏ మాత్రం ఆశానకంగా కనిపించడం లేదు. ఆ ప్రభావం దేశ  ఆర్థిక వ్యవస్థపైనా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2020 -21) జీడీపీ వృద్ధి రేటు మైనస్‌  1.5 శాతం, స్థూల విలువ జోడిం పు (జీవీఏ) ఆధారంగా లెక్కించే జీడీపీ వృద్ధి రేటు 1.7 శాతం పడిపోనున్నాయి.


కన్స్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే (సీసీఎస్‌) పేరుతో ఆర్‌బీఐ గురువారం విడుదల చేసిన  సర్వే ఈ విషయం పేర్కొంది. సర్వే ఆఫ్‌ ప్రొఫెషనల్‌ ఫోర్‌కాస్టర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) అనే సంస్థ ద్వారా ఆర్‌బీఐ గత నెల 5-17 మధ్య ఈ సర్వే నిర్వహించింది. ఇందుకోసం హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు దేశంలోని 13 ప్రధాన నగరాల్లో 5,300 కుటుంబాలను సర్వే చేసి ఎస్‌పీఎఫ్‌ ఈ నివేదిక రూపొందించింది. 


  • జీడీపీ వృద్ధి మైనస్‌ 1.5 శాతం 
  • కుదేలైన వినియోగదారుల నమ్మకం 
  • ఆర్‌బీఐ సర్వే వెల్లడి 


ప్రధానాంశాలు 

  1.   2020-21లో మైనస్‌ 1.5 శాతానికి తగ్గనున్న జీడీపీ వృద్ధి రేటు
  2.   మైనస్‌ 1.7 శాతానికి జీవీఏ వృద్ధి రేటు
  3.   2021-22లో 7.2 శాతం జీడీపీ వృద్ధి 
  4.   2020-21లో 0.5 శాతం తగ్గి, 2021-22లో 6.9 శాతం పెరగనున్న ప్రైవేటు వినియోగం.
  5.   2020-21లో 6.4 శాతం తగ్గనున్న స్థిర మూలధన కల్పన.
  6.   2021-22లో 5.6 శాతం పెరగనున్న స్థిర మూలధన కల్పన

Updated Date - 2020-06-05T06:15:49+05:30 IST