ఎంతమాత్రం అభినందనీయం కాదు : వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2020-09-24T00:17:10+05:30 IST

కొందరు సభ్యులు సభను బాయ్ కాట్ చేసిన తర్వాత బిల్లులు ఆమోదం పొందడం ఎంత మాత్రం అభినందనీయం కాదని

ఎంతమాత్రం అభినందనీయం కాదు : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ : కొందరు సభ్యులు సభను బాయ్ కాట్ చేసిన తర్వాత బిల్లులు ఆమోదం పొందడం ఎంత మాత్రం అభినందనీయం కాదని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అయితే సభ్యులు సస్పెండ్ కావడం, ఆ తర్వాత బిల్లులు పాస్ కావడం, సభను బాయ్ కాట్ చేయడం అనే అంశాలు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం కాదని, గతంలో కూడా జరిగాయని, అయితే ఇలా జరగడం మాత్రం అభినందనీయం కాదని పేర్కొన్నారు. ఈ రకమైన సంఘటనలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.


సభలో కొందరు సభ్యులు ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించిందని, ఈ అంశం సమిష్ఠిగా ఆలోచించాల్సిన అంశమని పేర్కొన్నారు. డిప్యూటీ చైర్మన్ ను తొలగించాలంటూ నోటీసులివ్వడం రాజ్యసభ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. ‘‘రాజ్యసభ చైర్మన్ గా ఈ రకమైన సంఘటనలను చూసి సహజంగానే అందరి కంటే ఎక్కువగా బాధపడ్డా. ఇంత జరుగుతున్నా... నిస్సహాయంగా ఉండటం, నిబంధనల ప్రకారం సభ్యులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిన సమయంలో చాలా బాధ కలిగింది.’’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-24T00:17:10+05:30 IST