బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కంటికి శస్త్ర చికిత్స జరిగింది, నెమ్మదిగా కోలుకుంటున్నాననీ ఆయన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. శనివారం ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ‘‘కంటికి సంబంధించిన సమస్యలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ వయసులో కంటి ఆపరేషన్ అంటే జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు నాకు మెరుగైన వైద్యం అందించారు. కానీ చూపు సరిగా రావడానికి, కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. బ్లాగ్లో అక్షర దోషాలు ఉంటే క్షమించాలి’’ అని తెలిపారు.